బుల్డోజర్లు రెడీ.. ఎవరు అడ్డం వస్తారో రండి: సీఎం రేవంత్‌

Published on Sat, 10/19/2024 - 13:16

సాక్షి, హైదరాబాద్‌: అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. అలాగే, పేదలు ఎవరైనా ఫామ్‌హౌస్‌లు కట్టుకోగలుగుతారా? ప్రశ్నించారు. బుల్డోజర్ సిద్ధంగా ఉంచాను.. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి అంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు.

సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం చార్మినార్‌ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణలో అక్రమార్కుల కంటికి కునుకు లేకుండా చేస్తాను. ఈరోజు మూసీ దగ్గరికే వచ్చా.. సవాలు విసిరిన హరీష్‌ ఎక్కడ పోయాడు?. హైడ్రా అనగానే ఈటల, హరీష్, కేటీఆర్ బయటకి వచ్చారు. హైడ్రాకి పేదలు ఎవరూ భయపడడం లేదు. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వాళ్లు భయపడుతున్నారు. అనుమతులు ఉన్న వాళ్ళు హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదు. అధికారులు అడిగినప్పుడు మీ అనుమతి పత్రాలు చూపించండి.

రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక ఉగ్రవాదుల భరతం పడతాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరూ భయపడకండి. పెద్దలను కట్టడి చేసి పేదలకు పంచుతాం. నిర్వాసితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం. మురికిలో మునిగి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సాయం చేస్తాం. హైడ్రా వేరు, మూసీ ప్రక్షాళన వేరు. పేదలు తాగే నీళ్ళలో డ్రెనేజీ కలిపే వాళ్ళని చెరువులో తోక్కుతాం

బుల్డోజర్ ఖాళీగా ఉంచాను. ఎవరు అడ్డం వచ్చి పడుకుంటారో రండి. కేటీఆర్ ఫామ్‌ హౌస్‌ అక్రమంగా కట్టుకోలేదా.. పోయి చూద్దాం రండి. అజీజ్ నగర్‌లో హరీష్ ఫామ్‌ హౌస్‌ లేదా?. తన ఫామ్‌హౌస్‌ మీదికి బుల్డోజర్ వస్తుందని కేటీఆర్, హరీష్ భయపడుతున్నాడు. హరీష్, కేటీఆర్ ఫామ్‌ హౌస్‌ దగ్గరికి నిజనిర్ధారణ కమిటీని పంపిస్తాం. మూసీని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇళ్లను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)