Breaking News

ఆ విషయం కేసీఆర్‌నే అడగండి: సీఎం రేవంత్‌

Published on Mon, 12/29/2025 - 13:35

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌-రేవంత్‌ కరచలనం.. పలకరింపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. కేసీఆర్‌ను తాను ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు కదా అని రేవంత్‌ అంటున్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో ఈ అంశంపై స్పందించారు.  

‘‘కేసీఆర్‌ను నేను సీఎం హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో ఆస్పత్రిలోనూ కలిశాను కదా. నేను సభా నాయకుడ్ని. కాబట్టి అందరినీ గౌరవిస్తా. అందుకే కేసీఆర్‌ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. మరి సభలో నుంచి వెంటనే ఎందుకు వెల్లిపోయారే ఆయన్నే అడగాలి’’ అని రేవంత్‌ అన్నారు. 

శీతాకాల సమావేశాల్లో భాగంగా.. తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌ అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లే లోపు సభలో సీఎం రేవంత్‌, ప్రభుత్వం విప్‌లు, మంత్రులు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ సైతం  కేసీఆర్‌ దగ్గకు వెళ్లి పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి మినహా మిగతా బీఆర్‌ఎస్‌​ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అయితే.. 

రాకరాక సభకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపైనా సభలో ఉంటారనుకున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా... బావుంది అని చెప్పారు. నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు.. బావుందని చెప్పా. కేసీఆర్ హాస్పిటల్ లో దీక్ష చేశారు. నేను రోడ్లపై దీక్ష చేశాను. నేను ఒరిజినల్ ఉద్యమకారుడిని. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ బయటకి వెళ్లారు. మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేది అని కోమటిరెడ్డి అన్నారు.

పెద్ద మనిషిగా కేసీఆర్ ను కలవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కేసీఆర్ ను కలిశారు. నేనూ కేసీఆర్‌ను కలవాలి అనుకున్నా. కానీ, ఆయన చుటటూ దుర్మార్గులు ఉన్నారు. అందుకే కలవలేదు అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు.

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)