Breaking News

లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం!

Published on Fri, 03/22/2024 - 03:09

సాక్షి, హైదరాబాద్‌: ఓ సామాన్యుడిని సీఎం స్థాయికి ఎదిగేలా చేసిననది, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పతనానికి బీజం వేసినది మల్కాజి గిరి లోక్‌సభ నియోజక వర్గమేనని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నిక ల్లో మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో ఆశించిన స్థాయి లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలవలేదని, ఇప్పటికైనా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం రేవంత్‌ మాట్లాడారు.

‘‘లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. నా బలం, బల గం కార్యకర్తలే. మల్కాజిగిరిలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కొందరు నాయకులు అమ్ముడుపో యి నా, కార్యకర్తలు నన్ను భుజాల మీద మోసి గెలిపించి ఢిల్లీకి పంపారు. ప్రతీ బూత్‌లో ఒక్కో కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేశారు. నాటి మల్కాజిగిరి గెలుపే నన్ను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది..’’ అని పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మంతా కాంగ్రెస్‌ తుఫాను వచ్చినా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. ఇక్కడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం నాలుగు గెలిస్తే అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేదని పేర్కొ న్నారు.

అందుకే మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌ విజయం సాధించేలా పార్టీ యంత్రాంగం కృషి చేయాలని కోరారు. హోలీ పండుగలోగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటిస్తుందని, కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని చెప్పారు. పార్టీకి బలమైన నాయకత్వం ఉందని, సమన్వయంతో ముందుకెళితే విజయం సాధిస్తామని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, సుధీర్‌రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)