Breaking News

మొదటిసారి గెలవడం ఓకే.. రెండోసారి గెలవడమే గొప్ప

Published on Thu, 01/02/2025 - 05:54

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సరం తొలిరోజు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొలిటికల్‌ క్లాస్‌ తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, కాంగ్రెస్‌ నేతలు పెద్ద సంఖ్యలో సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటిసారి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం సరదాగా మాట్లాడుతూ.. తన రాజకీయ అనుభవాన్ని పంచుకున్నారు. ‘ప్రజాప్రతినిధిగా మీరు చేసే పనులన్నీ ప్రజలకు రిజిస్టర్‌ అవుతుంటాయి. 

అన్ని విషయాలను వారు గుర్తుపెట్టుకుంటారు. మొదటిసారి మీపై చాలా అంచనాలతో గెలిపిస్తారు. అది గొప్ప విషయమేమీ కాదు. మీరేంటో తెలిసిన తర్వాత, మీ పనితీరు అర్థం చేసుకున్న తర్వాత రెండోసారి గెలిపిస్తేనే గొప్ప విషయం. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లి వస్తుండాలి. కార్యకర్తలతో మమేకం కావాలి. మీరు ఈజీగా తీసుకుంటే ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ప్రజలు ఒకసారి ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత అసలు రాజకీయమంటే ఏంటో అర్థమవుతుంది’అని క్లాస్‌ తీసుకున్నారు. అక్కడే ఉన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఉద్దేశించి.. ఆయన ఎలా గెలుస్తున్నారో అడిగి తెలుసుకోవాలని సూచించారు. 

మీరే మాట్లాడండి.. 
కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. తాను కూడా మరింత పట్టుదలతో పనిచేస్తానని చెప్పారు. ఉదయం నుంచి మంత్రులకు, పార్టీ నేతలకు తానే ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియజేశానని తెలిపారు. ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మీ కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపండి. వీలున్నప్పుడల్లా వారితో మాట్లాడండి. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కేడర్‌ను కలుపుకుని ముందుకెళ్లండి. ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి’అని సూచించారు.  

నా రిపోర్టు నా దగ్గరే ఉంది 
తన పనితీరుకు 100కి 100 మార్కులు వేసుకోబోనని సీఎం రేవంత్‌ అన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి వచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయని, తన రిపోర్టు కూడా తన దగ్గరే ఉందని తెలిపారు. ఈ రిపోర్టులను త్వరలోనే అందరికీ పంపిస్తానని కూడా చెప్పినట్టు తెలిసింది. 

సీఎంగా అధికారిక బాధ్యతలు అలవాటు అయినందున.. ఇక నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకోవద్దని, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతలకు స్పష్టంచేసినట్లు తెలిసింది. అంగన్‌వాడీలు, రేషన్‌ డీలర్ల నియామకంలో తమకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ఓ మంత్రి కోరిన సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.  

సీఎం మాటలు స్ఫూర్తినిచ్చాయి: ఎంపీ చామల కిరణ్‌రెడ్డి 
ప్రజాప్రతినిధి హోదాలో తొలిసారి సీఎం రేవంత్‌ను కలవడం స్ఫూర్తినిచ్చిందని, ఆయన చెప్పిన మాటలు తన బాధ్యతను మరింత పెంచాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌ను ఎప్పుడు కలిసినా ఏదో ఉత్తేజం వస్తుందని, ఈసారి మాత్రం రాజకీయ అనుభవాల గురించి ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆయన చెప్పారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)