Breaking News

ఢిల్లీ హీట్‌: అటు కేటీఆర్‌.. ఇటు రేవంత్‌.. గవర్నర్‌ కూడా..

Published on Tue, 11/12/2024 - 10:58

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ బయలేర్దారు. కాంగ్రెస్‌ పెద్దలను ఆయన కలవనున్నారు. మరో వైపు సీఎం రేవంత్‌పై కేంద్రానికి కేటీఆర్‌ ఫిర్యాదు చేయనున్నారు. ఇద్దరు నేతలు ఒకే సమయంలో ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అమృత్‌ పథకంలో స్కాం జరిగిందని కేంద్రానికి కేటీఆర్‌ ఫిర్యాదు చేయనున్నారు. సీఎం రేవంత్‌ బావమరిది సృజన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చారని కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు.

సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో రేవంత్ ఢిల్లీ టూర్‌కు వెళ్లడంతో కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్‌లో చేరాలనుకునే కాంగ్రెస్ నేతల జాబితా ఇప్పటికే ఢిల్లీ నేతలకు చేరినట్లు సమాచారం.

కాగా, మరోవైపు తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ ఢిల్లీ పర్యటన కూడా  ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన సమయంలో గవర్నర్ ఢిల్లీ టూర్‌పై ఉత్కంఠ నెలకొంది. అయితే గవర్నర్‌ ఢిల్లీ పర్యటన సస్పెన్స్‌గా మారింది. ఏసీబీ కేసు అనుమతి గురించి చర్చించేందుకా? లేక మరో కారణమా అనేది తెలియాల్సి ఉంది.

ఢిల్లీకి బయల్దేరిన సీఎం - రేవంత్ రెడ్డి

 

 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)