Breaking News

రైతు భరోసాపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన

Published on Sun, 12/01/2024 - 16:30

సాక్షి, హైదరాబాద్‌: ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నానంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. అప్పులతో రాష్ట్రాన్ని కేసీఆర్‌ తమకు అప్పగించారని.. పదేళ్లలో రూ. 7 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.

 కాంగ్రెస్‌పై ప్రజలకు ప్రేమ తగ్గలేదు
‘‘తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉండేది. కేసీఆర్‌ చేసిన అప్పులకు ప్రతి నెల రూ. 6,500 కోట్ల వడ్డీ కడుతున్నాం. మేము అధికారంలోకి రాగానే వైట్‌ పేపర్‌ విడుదల చేశాం. కాంగ్రెస్‌పై ప్రజలకు ప్రేమ తగ్గలేదు. నాడు ప్రజలకు  వాస్తవాలు ఎవరూ చెప్పలేదు, వివరించలేదు.

మరింత మెరుగైన పాలన అందిస్తాం..
..వానాకాలంలో కేసీఆర్‌ రైతు బంధు ఎగ్గొడితే మేము వచ్చాక రైతు బంధు నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చాం. నెలనెలా అప్పులు కడుతూనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. రైతు పండగ ఇచ్చిన ఉత్సాహంలో మరింత మెరుగైన పాలన అందిస్తాం. రైతుల మద్దతుతో మరో తొమ్మిదేళ్లు పాలన కొనసాగిస్తాం.’’ అని రేవంత్‌ తెలిపారు.

 

రైతు భరోసాపై కీలక ప్రకటన
రైతు భరోసాపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా కొనసాగిస్తామని.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తాం. వరికి రూ.500 బోనస్ఇ స్తాం. విధి విధానాల ఖరారుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశాం. కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తాం. ఎవరెంత అడ్డుపడినా రైతు భరోసా ఇస్తాం. మారువేషంలో వచ్చే మారీచులను నమ్మకండి. రైతులు నాణ్యమైన సన్న వడ్లు పండించాలి. తెలంగాణ, సోనా, బీపీటి, హెచ్‌ఎంటీ వరిని పండిస్తే రైతులకు లాభదాయకం’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.


 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)