Breaking News

డీజీపీని చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం.. ఎందుకంటే?

Published on Mon, 10/21/2024 - 19:06

పాట్నా: బీహార్ పోలీస్‌ కార్యక్రమంలో నాటకీయ ప‌రిణామం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్‌ను చేతులు జోడించి అభ్య‌ర్థించారు.

సోమవారం బీహార్‌లో కొత్తగా నియమితులైన 1,239 మంది పోలీసు అధికారులకు అపాయింట్‌మెంట్ లెటర్లను అందించే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్ త‌న ప్ర‌సంగం మ‌ధ్య‌లో చేతులు జోడించి బీహార్ డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి త్వరలో మరిన్ని రిక్రూట్‌మెంట్‌లు జరిగేలా చూస్తారా? అని అడిగారు. 

సీఎం నితిష్ కుమార్ విజ్ఞ‌ప్తితో డీజీపీ అలోక్ రాజ్ మెరుపు వేగంతో స్పందించారు. వేదిక‌పై కూర్చొన్న డీజీపీ ఒక్క‌సారి లేచి సెల్యూట్ చేశారు. వెంట‌నే నితీష్ కుమార్ లేదు ముందు మీరు పోలీస్ రిక్రూట్‌మెంట్ త్వ‌ర‌గా చేస్తారా? అని మ‌రోసారి అడిగారు. అందుకు డీజీపీ స్పందిస్తూ.. సీఎం నితీష్ ఆదేశాలను అమలు చేసేందుకు బీహార్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. త్వ‌ర‌లో పోలీసు రిక్రూట్ మెంట్ నిర్వ‌హిస్తాం’ అని అన్నారు.  

వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు
వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతవారం  బీహార్ ప్రతిపక్ష ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగనన్ని దారుణాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. కానీ చర్యలు లేవు. ఫిర్యాదు చేస్తే విచారణ శూన్యం. ప్రజలకు న్యాయం జరగదు. ఇకపై సీఎం నితీష్‌ కుమార్‌ బీహార్‌ను నడపలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం నితీష్ కుమార్ డీజీపీ అలోక్ రాజ్ పోలీస్ రిక్రూట్ మెంట్ జరిగేలా చూడాలని కోరుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)