Breaking News

‘కేజ్రీవాల్‌ బరువు 8 కేజీల తగ్గి.. ఆరోగ్యం క్షీణిస్తోంది’

Published on Sun, 06/23/2024 - 07:57

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహార్‌ జైలులో ఉన్నారు. అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర  ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిన మార్చి 21 నుంచి సుమారు 8 కేజీల బరువు తగ్గినట్లు ఆప్‌ చెబుతోంది. అరెస్ట్‌కు ముందు ఆయన బరువు 70 కేజీలు ఉండగా.. అనంతరం ఆయన బరువు జూన్‌ 22 వరకు 8 కేజీలు తగ్గి 62 కేజీలకు పడిపోయిందని ఆప్‌ నేతలు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ 8  కేజీల బరువు తగ్గారని తెలిపారు. 

ఇలా బరువు తగ్గటంపై అసలైన కారణం తెలుసుకోవటం కోసం వెంటనే ఆయన డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. అరవింద్‌ కేజ్రీవాల్‌ బరువు తగ్గటంపై ఎయిమ్స్‌ వైద్యులు ఆయనకు ఇ‍చ్చే ఆహారంలో పూరీలు, పరాటాలు చేర్చాలని సూచింనట్లు ఆప్‌ పేర్కొంది.

ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌కు వారం రోజులు పాటు మధ్యంత బెయిల్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే మాక్స్‌ ఆస్పత్రి వైద్యులు ఆయనకు పలు పరీక్షలు చేసీ.. బరువు తగ్గడానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారని ఆప్‌  తెలిపింది. ఇటీవల సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు రౌజ్‌ అవెన్యూ ట్రయల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ట్రయిల్‌ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)