Breaking News

యాదాద్రిలో కాంగ్రెస్‌కు షాక్‌! కేసీఆర్‌ సమక్షంలో కారెక్కిన అనిల్ కుమార్ రెడ్డి

Published on Mon, 07/24/2023 - 20:27

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ధరణిలో భూమి వచ్చిందంటే ఎవడూ మార్చలేడని.. నీ భూమి హక్కు నీ బొటన వేలుతో మాత్రమే మార్చేలా తీసుకొచ్చామన్నారు. ధరణిలో సమస్యలు ఉంటే ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ధరణి తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎలా రావాలని అని ప్రశ్నించారు. ధరణితో భూమి సేఫ్‌ అని, రైతు బంధు డబ్బులు నేరుగా బ్యాంకులోనే పడతాయని చెప్పారు. 

గులాబీ గూటికి యాదాద్రి నేతలు
యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రగతి భవన్‌లో వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం. అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. అనిల్‌ కుమార్‌, శేఖర్‌ రెడ్డి చెరో పదవి తీసుకొని పని చేయాలని సూచించారు. అనిల్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు జిమ్మేదారి తనదని అన్నారు. 

అనేక అవమానాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గత ముఖ్యమంత్రులు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. కరెంట్‌ లేక గతంలో పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. 24 గంటల కరెంట్‌ ఇస్తామంటే ఎవరూ నమ్మలేదని.. ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలు కరెంట్‌ ఇస్తున్నామని అన్నారు.

‘24 గంటల కరెంట్‌తో రైతులు ఎప్పుడైనా పొలానికి నీళ్లు పెట్టుకోవచ్చు. రాష్ట్రంలోప్రస్తుతం మూడు పంటలు పండుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని రైసు మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. రైతు బాగుంటేనే పదిమందికి అన్నం పెడతాడు. బస్వాపూర్‌ ప్రాజెక్టుతో భువనగిరి, ఆలేరులో కరువే రాదు. 8 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాని అప్పు ఎప్పుడో తేరిపోయింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 
చదవండి: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)