Breaking News

ప్రధాని క్షమాపణలు చెప్పాక పరిస్థితి మారిందా? అందుకే బీఆర్‌ఎస్‌ రంగంలోకి..

Published on Mon, 04/24/2023 - 20:20

ముంబై: మహారాష్ట్రలో అనేక నదులు ప్రవహిస్తున్నా.. ఈ కరువు ఎందుకని ప్రశ్నించారు బీఆర్‌ఎస్‌ చీఫ్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితా? అని విస్మయం వ్యక్తం చేశారు. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని.. పేదలు మరింత పేదరికంలో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్‌ సోమవారం సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేసింది. కేసీఆర్‌ సమక్షంలో పలువురు మహారాష్ట్ర నేతలు పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఔరంగాబాద్‌, అకోలాలో నీటి ఎద్దడి ఉందన్నారు. అదే తెలంగాణలో నీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి పట్టదా?
‘మన దేశంలో ఏం జరుగుతుందో అర్థకావడం లేదు. ప్రస్తుతం మన దేశం ముందున్న లక్ష్యం ఏమిటి?. నేను చెప్పే విషయాలను ఇక్కడే మర్చిపోకుండా.. మీ గ్రామాలకు, బస్తీలకు వెళ్లి చర్చించండి. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. ఎంత త్వరగా మనం మేలుకుంటే అంత త్వరగా బాగుపడతా. 13 నెలలపాటు ఢిల్లీలో రైతులు నిరసన చేయాల్సి వచ్చింది. 770 మంది రైతులు చనిపోయినా కేంద్ర ప్రభుత్వానికి పట్టదా?. వ్యవసాయ చట్టాలు రద్దు అంటూ ప్రధాని క్షమాపణలు చెప్పాక పరిస్థితి మారిందా?. 

భయపడేది లేదు..
నీరు, కరెంట్‌ సమస్యల్ని కూడా కేంద్రం పరిష్కరించలేకపోయింది. నీటి ఎద్దడి పరిష్కారానికి నెహ్రూ హయాంలో కొంత ప్లానింగ్‌ జరిగింది. మనదేశంలో మార్పు రావాల్సిందే. ఎంతమంది ప్రధానులు మారినా, మన కష్టాలు మాత్రం పోలేదు. దేశంలో మార్పు తీసుకురావడానికే బీఆర్‌ఎస్‌ వచ్చింది. కులం, మతం ప్రాతిపదికన బీఆర్‌ఎస్‌ ఏర్పడలేదు. కొత్త పార్టీ వస్తే దానిపై ఎన్నో అపవాదులు సృష్టిస్తారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, మేము భయపడేది లేదు. నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ పర్మినెంట్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేస్తున్నాం’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.
చదవండి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు తగ్గిన ఆదరణ!.. వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)