Breaking News

ఇదేం శాడిజం.. పింఛన్ పంపిణీకి తంటాలు

Published on Wed, 07/31/2024 - 12:42

విజయవాడ, సాక్షి: పింఛన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్‌ వ్యవస్థను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే రంగంలోకి దించింది...  

వలంటీర్లు లేకుండానే గత నెల పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో వలంటీర్లు అవసరం ఏముంది? అనే ఆలోచనను సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తెస్తోంది. అంతేకాకుండా జగన్‌ తెచ్చిన వలంటీర్‌ వ్యవస్థను మనం కొనసాగించడం ఏంటని.. దానిని రద్దుచేయాలని కూటమి నేతలు చంద్రబాబును కోరుతున్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. 

మోసపోయాం: వలంటీర్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కోసం వైఎస్‌ జగన్‌ వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే.. తొలినాళ్లలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్‌ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల టైంలో ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా చంద్రబాబు.. వలంటీర్లను పెన్షన్‌ పంపిణీకి దూరం చేసి లబ్ధిదారులకు నరకం చూపించారు. ఈ క్రమంలో కొందరు చనిపోయారు కూడా.  

ఏపీలో ఎన్నికల ముందు రెండు నెలలు.. ఎన్నికల తర్వాత రెండు నెలలు.. వలంటీర్లు ఖాళీగా ఉన్నారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న గౌరవవేతనం మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్‌గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తయినా ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. 

సచివాలయ ఉద్యోగులు కూడా!
చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్‌ పంపిణీ చేయాలని, ఒకవేళ గ్రామాల్లో నివాసం లేని వాళ్లు ఇవాళ అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపీడీవోలకు మౌలిక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో అధికారుల ఉత్తర్వులతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పోనీ పెన్షన్‌ పంపిణీ అయినా వాళ్ల చేత సక్రమంగా చేయించారా? అంటే అదీ లేదు. టీడీపీ నేతల జోక్యంతో అది కాస్త రాజకీయ కార్యక్రమంగా నడిచింది. మరోవైపు సర్వర్‌లో ఇబ్బందులతో ఇటు సచివాలయ ఉద్యోగులు.. అటు ఫించన్‌దారులు నానా ఇబ్బందులు పడ్డారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)