Breaking News

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సగం కూడా దక్కలేదు

Published on Thu, 06/13/2024 - 05:54

సాక్షి, అమరావతి: జనాభాపరంగా అత్యధికంగా ఉన్న బీసీలకు 24 మందితో కొలువుదీరిన సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో కనీసం సగం కూడా స్థానం దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీసీలకు కేవలం 8 మంత్రి పదవులు ఇవ్వగా అతి తక్కువ జనాభా ఉన్న సీఎం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి మాత్రం ఐదు పదవులు (బాబుతో కలిపి) దక్కడం గమనార్హం. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన రెడ్డి సామాజిక వర్గానికి సైతం చంద్రబాబు నిరాశే మిగిల్చారు.

వైఎస్సార్‌ సీపీ పాలనలో ఒక్క బీసీలకే పది మంత్రి పదవులు ఇవ్వగా, ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు ఒకటి, మైనారిటీలకు ఒక మంత్రి పదవి చొప్పున దక్కా­యి. మొత్తం మంత్రివర్గంలో వైఎస్‌ జగన్‌ ఆయా వర్గాలకు ఇచ్చిన పదవుల శాతం 68 కాగా ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో వారికిచ్చిన పదవులు 45 శాతం మాత్రమే కావడం గమనార్హం. 

» సీఎం చంద్రబాబు మంత్రి పదవుల్లో బీసీలకు 8, కాపులకు 4, రెడ్డి వర్గానికి కేవలం మూడు మాత్రమే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి­టీలకు పెద్దపీట వేశారు. ఆయా వర్గాలకు ఆయన ఏకంగా 17 మంత్రి పదవులు ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 12 పదవులు మాత్రమే ఇచ్చారు. 

»   వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు ఒక్కో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో కాపు వర్గానికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్‌ జగన్‌ హయాంలో ఆయనతో కలిపి ఐదు పదవులు దక్కగా చంద్రబాబు ప్రభుత్వంలో ముగ్గురికే అవకాశం లభించింది. 

»  వైఎస్‌ జగన్‌ ప్రతి అడుగులో సామాజిక న్యాయాన్ని పాటించారు. మంత్రివర్గం నుంచి స్థానిక సంస్థలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ­లు లాంటి అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతానికిపైగా ఇచ్చి రాజ­కీయ సాధికారతకు బాటలు వేశారు. చంద్రబాబు తొలి అడుగులోనే సొంత సామాజిక­వర్గంపై మక్కువ ప్రదర్శించి దళిత, మైనారిటీ, బీసీ వర్గాలను చిన్నచూపు చూశారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)