Breaking News

టీడీపీ కోసం 37 కేసులు పెట్టించుకున్నా.. ఏం లాభం?

Published on Sat, 08/03/2024 - 11:35

విజయవాడ, సాక్షి: అధికారంలో ఉన్నా పదవి ఉంటేనే ఏదైనా చెల్లుతుందని, ఆ పదవి లేకనే తాను ఏం చేయలేకపోతున్నానంటూ టీడీపీ సీనియర్‌ నేత బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల్లో ఆయన ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.  

‘‘పదవి లేక పోవడంతో నన్ను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేక పోతున్నా. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గింది. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారు. నా మాట చెల్లలేదు. చాలా ఆవేదనగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇతరుల మీద ఆధారపడ్డాను. నన్ను నమ్ముకున్న వారికి నేనేం చేస్తాను. నన్ను కార్యకర్తలు క్షమించాలి.. 

.. 2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు నాయుడు  చిత్రపటం కాళ్ళు కడిగా. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వచ్చినోళ్లను నేను అడ్డుకున్నా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు  అప్పుడెవరు వచ్చారో చెప్పాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. అందులోని వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి లాంటి వాళ్లను తిట్టా. టీడీపీ కోసం ఎంతో చేశా. 

.. నా మీద మొత్తం 37 కేసులు ఉన్నాయి. కేవలం టీడీపీ కోసమే ఆ 37 కేసులు పెట్టించుకున్నా. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు న్యాయం జరగలేదని భావిస్తున్నా. ఈ మాట ఆవేదనతోనే చెబుతున్నా తప్ప వ్యతిరేకతతో కాదు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశా.. 

.. ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నా. నా కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో నేను ఉన్నా. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి అయినా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తా.. ఎమ్మెల్యేగా గెలుస్తా. చచ్చేంతవరకు టీడీపీలోనే ఉంటా. నా ఆవేదనను ఎంపీ కేశినేని చిన్ని టిడిపి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి అని బుద్దా వెంకన్న అన్నారు. 

బుద్దా ప్రసంగం ముగిసిన వెంటనే ఎంపీ కేశినేని చిన్ని మైక్‌ అందుకున్నారు. ‘‘పొత్తుల్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటును బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు తెలుసు. దీన్ని అధిష్టానం దృష్టికి సాధ్యమైనంత త్వరగా తీసుకువెళతా. కార్యకర్తలు నాయకులు ఏమాత్రం అధైర్యపడొవద్దు. త్వరలోనే బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలకు కూడా మంచి పదవులు వస్తాయి అని బుద్దాను సముదాయించే మాటలు చెప్పారు. 

ఇదిలా ఉంటే.. సీఐల బదిలీలే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చిచ్చు రాజేసినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరికి, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారం ఉంది. అయితే.. ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు వేడుకల సాక్షిగా అది నిజమని తేలింది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి