'నో చెప్పలేం'.. రాజకీయ ఎంట్రీపై కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!

Published on Sun, 07/26/2026 - 09:06

ఢిల్లీ: బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

 ఈ చారిత్రాత్మక విజయం అనంతరం..ఓ  జాతీయ మీడియా సంస్థ ..‘సీజేపీ ప్రతినిధుల్ని మరి మీ నెక్ట్స్‌ ప్లాన్ ఏంటి? ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా?’..అని అడగ్గా.. భారత్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కాబట్టి దేనినైనా పూర్తిగా కొట్టిపారేయలేం’ అంటూ సీజేపీ నాయకత్వం తాము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే బలమైన హింట్‌ ఇచ్చింది.

ఆందోళనకారుల ప్రధాన డిమాండ్లను కేంద్రం అంగీకరించిన వెంటనే జాతీయ మీడియా ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ తమ ఉద్యమ భవిష్యత్తు గురించి, అలాగే తమ బృందం భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందా అనే అంశాలపై మాట్లాడారు.

ఇప్పుడు నా మనసులో ఉన్న ఏకైక ఆలోచన ఇంటికి వెళ్లి నిద్రపోవడం, కాస్త విశ్రాంతి తీసుకోవడం,నా కుటుంబాన్ని కలవడం మాత్రమే. గత కొన్ని నెలలుగా నేను ఇంటికి దూరంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటూ గత రెండు నెలల్లో జరిగిన పరిణామాల గురించి ఆలోచించుకోవాలని అనుకుంటున్నాను. ఇదంతా మా అందరికీ ఒక పెద్ద అనుభూతిని కలిగించే విషయం. ఇది గర్వపడాల్సిన సమయం. ఊరట పొందే సమయం ఇది. ఆ తర్వాత, పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం’ అని రంకా చెప్పారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేస్తున్నారా అని అడిగినప్పుడు ‘భారత్‌లో దేనికీ నో అని చెప్పకూడదనేదే నా అభిప్రాయం అని ఆయన బదులిచ్చారు. అయితే, రాజకీయాలు సీజేపీ బృందం తక్షణ లక్ష్యం కాదని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం మా దృష్టి చాలా స్పష్టంగా ఉంది. ఈ ఉద్యమం క్షేత్రస్థాయికి వెళ్లాలి. ఎందుకంటే ఇప్పటికే 750-800 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ వాటిలో ఏదీ యువత ఆకాంక్షలను నెరవేర్చ లేకపోతోంది. అధికారంలో ఏ పార్టీ లేదా నాయకుడు ఉన్నా సరే వారు యువత కోసం పనిచేసేలా వారి డిమాండ్లను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. అదే మా ప్రస్తుత అజెండా’ అని దాస్ చెప్పారు.   

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)