Breaking News

ఎమ్మెల్యే చింతమనేని అరాచకం.. జనసేన నేతపై దాడి

Published on Thu, 01/30/2025 - 15:18

సాక్షి, ఏలూరు జిల్లా:  దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అరాచకాలు కొనసాగుతున్నాయి. జనసేన నూజివీడు మండల అధ్యక్షుడు యర్రం శెట్టి రాముపై చింతమనేని అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారు. 2014 నుండి దుగ్గిరాలలో కౌలు వ్యవసాయం చేస్తున్న యర్రం శెట్టి రాము పొలంలో చెరుకు పంటను నాశనం చేశారు.

స్పందనతో పాటు, నారా లోకేష్, టీడీపీ పార్టీ అధ్యక్షుడు  పల్లా శ్రీనివాస్‌కు మొరపెట్టుకున్నా తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నేత వాపోతున్నారు.

తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పెట్టామని దుగ్గిరాల వీఆర్వోతో  తిరిగి తనపై కేసు పెట్టించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసిన చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని యర్రం శెట్టి రాము కోరుతున్నారు.

ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
యర్రంశెట్టి రాముపై చింతమనేని అనుచరుల దాడిపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంపై స్టేషన్ ఎదుట జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చింతమనేని, అతని  అనుచరులపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినా కానీ..  పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ముకొస్తున్నారు అంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దెందులూరులో జనసేన మండల అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని జనసేన నేతలు నిలదీశారు. స్పందనతో పాటు నారా లోకష్‌కు, జనవాణిలో ఫిర్యాదు చేసిన తమకు న్యాయం జరగలేదంటున్న జనసేన నేతలు.. చింతమనేని, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు