Breaking News

బీజేపీలో చేరుతున్న చికోటీ ప్రవీణ్‌.. నేడు భారీ ర్యాలీ

Published on Tue, 09/12/2023 - 07:45

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా తెరపైకి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మరో​ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు ముహర్తం ఫిక్స్‌ అయ్యింది. నేడు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో చికోటీ ప్రవీణ్‌ బీజేపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభిమానులతో కలిసి బీజేపీ ఆఫీసుకి చికోటీ ప్రవీణ్‌ భారీ ర్యాలీతో రానున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కర్మాన్‌ఘాట్‌లోని హనుమాన్‌ టెంపుల్‌ నుంచి భారీ ర్యాలీ తీయనున్నారు. ఎల్బీనగర్‌ మీదుగా దిల్‌సుఖ్‌నగర్‌, నల్లగొండ క్రాస్‌రోడ్స్‌, మలక్‌పేట్‌, కోఠి, అబిడ్స్‌, నాంపల్లి వరకు ర్యాలీ జరగనుంది. 

ఇక, బీజేపీలో చేరికపై చికోటీ ప్రవీణ్‌ స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ స్పూర్తితోనే పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అక్రమాలకు బీజేపీనే అడ్డుకోగలదని.. అందుకనే బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రవీణ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కూడా విచారించింది. 

ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఇక పరిశీలన పర్వం


 

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)