Breaking News

ఎమ్మెల్యే పులివర్తి నానికి చెవిరెడ్డి సవాల్‌

Published on Sat, 07/20/2024 - 13:27

సాక్షి, తిరుపతి: టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదు.. మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారంటూ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ ఒక్క టీడీపీ నేత, కార్యకర్తను కూడా వేధింపులకు గురిచేయలేదన్నారు.

‘‘2014-19 వరకు టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశాం. నాపై ఎన్నో కేసులు నమోదు చేసినా పోరాడా.. గతంలో మా పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిన్నా... నేనెప్పుడు పార్టీ కోసమే పనిచేశానని తెలిపారు. ‘‘నేను ఏ బాధ్యత తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించాను. టీడీపీ అధ్యక్షుడిగా నువ్వు ఏ రోజైనా పోరాటాలు చేశావా?. ‘టీడీపీ ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య  నాపై 88 కేసులు పెట్టారు. 7నెలలు జైల్లో పెట్టారు’’ అంటూ చెవిరెడ్డి ధ్వజమెత్తారు.

‘‘2019 నుంచి 2024 వరకు మీ క్వారీలు ఏనాడైనా అపారా?. మీ 12 లారీలు ఏ రోజైన ఆపారా..?. కరెంట్ చార్జీలు బకాయిలు ఉన్నా.. మీ పాలిషింగ్ యూనిట్ నడిచిందా లేదా?. పచ్చటి పల్లెల్లో విద్వేషాలు రెచ్చ గొడుతున్నావు.. మీకుటుంబం పైనా నేను ఆరోపణలు చేయడం నా సంస్కృతి కాదు. కిలారు రాజేష్ పేరుతో దందాలు చేయలేదా?, అధికారులను బెదిరించ లేదా?. కిరోసిన్, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించలేదా? నేను ఓడిపోతే 4వ తేదీన ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించలేదా?. చంద్రగిరి నియోజకవర్గం రాయలచెరువు రోడ్డు నెలరోజులకే వేశానంటే ప్రజలు ఎలా నమ్ముతారు?’’ అని చెవిరెడ్డి ప్రశ్నించారు

‘‘ప్రజలు అధికారం మీకు ఇచ్చారు.. ప్రశ్నించడం మాకు ఇచ్చారు. మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నా, ఏరోజూ వెనక్కు తగ్గం.. నా కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసులు పెట్టారు, నా కొడుకు ఏరోజు కేసులకు భయపడే వ్యక్తి కాదు. తుడా పరిధిలో అవినీతిపై మీరు విచారణ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా తుమ్మలగుంటలో  133 అడుగుల ఎత్తులో నిర్మాణం చేశాం. జాతీయ జెండా కూడా ఎగర నీయకుండా అడ్డుకున్నది నువ్వు కాదా?. తుడా అధికారులను బెదిరించలేదా?’’ అంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలదీశారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)