Breaking News

కేసులకు భయపడితే పోరాటం చేయలేం

Published on Thu, 04/13/2023 - 05:23

పటమట (విజయవాడ తూర్పు)/మచిలీపట్నం టౌన్‌: కేసులకు భయపడితే సీఎం వైఎస్‌ జగన్‌పై పోరాడలేమని, కేసులతో ఏం పీకుతారని టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబు నూరిపోశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన వివిధ ప్రాంతాల్లో మాట్లాడారు. అన్నిచోట్లా వైఎస్సార్‌ సీపీని దుర్భాషలాడటం, సీఎం వైఎస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించటం పరుష పదజాలంతోనే సాగింది. 10 రూపాయలు ఇస్తూ.. 100 రూపాయలు లాక్కుంటున్న జగన్, వైసీపీ నేతల దుర్మార్గాలు, దోపిడీ, కబ్జాలు చూశాక కూడా వైఎస్సార్‌సీపీ జెండా పట్టుకుంటారా అంటూ దూ­షిం­చారు.

బిడ్డల భవిష్యత్‌ బాగుండాలంటే, జీవి­తా­లు సంతోషంగా ఉండాలంటే తక్షణమే వైఎస్సార్‌­సీపీ జెండాను కృష్ణా నదిలో పడేసి, టీడీపీ జెండా పట్టుకోండన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి­చేసి.. విజయవాడలో గూండాయిజం, రౌడీయి­జం చేస్తున్న వారి తోకలు కత్తిరిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ మధ్య ఇంటింటికీ జగన్‌ స్టిక్కర్లు అతి­కిస్తున్నారని, ఇళ్ల గోడలపై రాయా­లన్నా, ఎలాంటి కరపత్రా­లు, బొమ్మలు అ­తికిం­చాలన్నా ఇంటి యజ­మానుల అనుమతి తప్పనిసరి అన్నారు. ఎలాంటి అనుమతి తీసుకుని వలంటీర్లు జగన్‌ స్టిక్కర్లు ప్రజల ఇళ్ల గోడలపై అతికిస్తున్నారని ప్రశ్నించారు.

పీక్కుంటూనే ఉండండి
‘ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ ఏం పీక్కుంటారు. నాపైన కూడా చాలా కేసులు పెట్టారు. ఇంకా పెడుతున్నారు. ఎన్ని కేసులు పెడితే పెట్టుకోమంటున్నా.. పీక్కుంటూనే ఉండమంటున్నా. నాకు సభ్యత ఉంది కాబట్టే హద్దులు మీరి వ్యక్తిగతంగా పోవడం లేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

విజయవాడలో ఫ్యాక్షన్‌  రాజకీయాలు సాగనివ్వమని, రమేశ్‌ యాదవ్‌  టీడీపీలో చేరడం ద్వారా ఒక స్ఫూర్తి ఇచ్చాడని అన్నారు. వైఎస్సార్‌సీపీ వల్ల రాష్ట్రానికి నష్టమని, సమాజానికి చేటని ముందే పసిగట్టి తెలుగుదేశం జెండా కప్పుకున్నాడన్నారు. ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే, వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టామని నోటి కొచ్చినట్టు మాట్లాడారని చంద్రబాబు విమర్శించారు. 

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలొద్దు
మచిలీపట్నంలో రోడ్‌ షోకు వస్తున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలతో నగరంలోని పలు ప్రాంతాలకు నుంచి అభిమానులు తరలివచ్చారు. రాత్రి 7.30 గంటల సమయంలో మూడు స్తంబాల సెంటర్‌ వద్ద డీజే పాటలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫొటోలతో అభిమానులు రాగా, అక్కడే ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రపటాలను ప్రదర్శించవద్దని అడ్డుకున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రపటాలను ప్రదర్శిస్తే తప్పేంటని యువకులు ప్రశ్నించినా.. లెక్క చేయకుండా లాక్కుని పక్కన పడేశారు. కొల్లు రవీంద్ర ఆదేశాలతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులందరినీ పార్టీ కార్యకర్తలు పక్కకు తోసుకువెళ్లారు. తమ అభిమాన నటుడు చిత్ర­పటాన్ని లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి­న అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)