Breaking News

చంద్రబాబు నోట మళ్లీ పాత పాట

Published on Thu, 08/01/2024 - 21:15

సాక్షి, నంద్యాల జిల్లా: అలవికాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు.. మళ్లీ పాత పాటే పాడారు. గురువారం.. శ్రీశైలంలో పర్యటించిన చంద్రబాబు.. ‘‘నేను ఎన్నో హామీలిచ్చాను.. కానీ ఖజానా ఖాళీగా ఉంది. డబ్బులు లేవు.. ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలను డైవర్ట్ చేయడానికి డ్రామాకు తెరలేపారు.

చంద్రబాబు హామీలు అమలు చేసేవి కా­వని తేలిపోగా, కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే.. వేలం పాట మాదిరిగా ప్రకటించిన హామీలు మరోసారి మాయ చేసేందుకేనని ప్రజలకు అర్థమవుతోంది. 2014లో మాదిరిగా ఈసారి కూడా మేనిఫెస్టో మాయం కావడం ఖాయమంటున్నారు. జనాన్ని ఎలా మోసం చేయాలన్న దానిపైనే చంద్రబాబు దృష్టి పెట్టారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. తల్లికి వందనం, రైతులకు, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, ఉచిత పంటల బీమా ఇలా ఎన్నో పథకాలకు ఇంకా డబ్బులు వేయలేని కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కూటమి పార్టీలకు ఓట్లు వేసి ఎంత తప్పు చేశామో తెలుసుకుంటున్న ఓటర్లు.. జగన్‌ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబువి బూటకపు మాటలేనని.. సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ నీటి మూటలేనని చంద్రబాబు వ్యాఖ్యలతో స్పష్టమైంది.

కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం ఏటా రూ.70 వేల కోట్లు దాకా ఖర్చు చేసింది. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకంగా నేరుగా లబ్దిదారులకే ప్రయోజనం చేకూర్చింది.

 

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)