Breaking News

సంపద సృష్టి చేతకాలేదు.. చంద్రబాబు ఒప్పేసుకున్నారు!

Published on Wed, 12/03/2025 - 15:12

సాక్షి, విజయవాడ: ఏపీ ఖజానా ఖాళీ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం చేతకాలేదని పరోక్షంగా ఆయన అంగీకరించారు. ఎంత వెతికిన కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదన్న చంద్రబాబు.. అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరన్నారు. అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదన్నారు. ఆదాయాన్ని బట్టి కొంతవరకే అప్పు చేయొచ్చు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం ఎక్కువ  అప్పు చేయడానికి వీలుండదు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీలకు తిలోదకాలివ్వడమే కాకుండా రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీ ఖజానా ఖాళీ అంటూ చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించడం.. సంపద సృష్టి చేతకాలేదని తేలిపోయింది. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పులు చేసింది. తద్వారా ప్రజలపై భారీగా రుణ భారం మోపింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం బడ్జెట్‌ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసింది. ఇక అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరంటూ చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారు.

బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్‌ సిక్స్‌లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్‌సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 17 కొత్త మెడికల్‌ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్‌ పరం చేస్తోంది.

Chandrababu: ఏపీ ఖజానా ఖాళీ..!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)