Breaking News

‘తల్లికి వందనం’ పథకానికి మంగళం.. ఈ ఏడాది లేనట్టే..

Published on Thu, 01/02/2025 - 15:25

సాక్షి, విజయవాడ: తల్లికి వందనం పథకానికి కూటమి సర్కార్‌ మంగళం పాడేసింది. చంద్రబాబు కేబినెట్‌ విద్యార్థుల తల్లులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆలోచిద్దామంటూ కేబినెట్‌ చేతులు దులుపుకుంది. ఈ ఏడాది తల్లికి వందనం లేనట్టేనని తేలిపోయింది.

అధికారంలోకి రాగానే పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రభుత్వం అమలు చేయలేదు. తల్లికి వందనం పథకం అమలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో 80 లక్షల మందికి 15 వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ హామీ ఇవ్వగా, ఈ ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కేబ్‌నెట్‌ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ, సూపర్ సిక్స్‌లో పథకాలపై చర్చించామన్నారు. తల్లికి వందనం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలు చేస్తామని తెలిపారు. ఈ అకడమిక్ సంవత్సరంలో అప్పుల కోసం ఆరా తీశాం. వచ్చే విద్యా సంవత్సరం లోపు తల్లికి వందనం చెల్లిస్తాం. రైతు భరోసా చెల్లింపుపై చర్చించాం. కేంద్రం ఇచ్చే షేర్ బట్టి రాష్ట్ర ప్రభుత్వం షేర్ రైతులకు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే ఇస్తాం. కేంద్రం నిర్ణయం బట్టి ఎంత చెల్లిస్తామో నిర్ణయిస్తాం’’ అని మంత్రి చెప్పారు.

కాగా, ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామంటూ మంత్రి నారా లోకేష్‌ ఊదరగొట్టారు. తల్లులు, పిల్లల డేటా సిద్ధంగా ఉన్నా.. విధివిధానాల రూపకల్పనలో జాప్యం జరుగుతోందని చెబుతూ.. ఇప్పట్లో పథకం అమలు చేయబోమని శాసన మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో పరోక్షంగా చెప్పిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: కిక్కే.. కిక్కు

తల్లికి వందనం అమలుకు విధివిధానాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని అడిగామని, దీనిపై మంత్రులందరితో చర్చిస్తు­న్నట్టు చెప్పారు. తాజాగా, కేబినెట్‌ కూడా చేతులెత్తేసింది. ఏపీలో కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టే పనిని ప్రారంభించింది. అయితే, తాజాగా తల్లికి వందనం విషయంలోనూ పిల్లిమొగ్గలు వేస్తుందనే చర్చ ప్రజల్లో మొదలైంది.

 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)