Breaking News

వరద సాయంపై వ‌దిన-మరిది.. తలోమాట!

Published on Fri, 09/06/2024 - 21:21

అమరావతి, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయం విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. తక్షణ సాయం కింద కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలు ప్రకటించిందని ఓ ప్రచారం జరగ్గా.. కాసేపటికే అతి ఉత్తదని చంద్రబాబు ప్రకటనతో తేలిపోయింది. 

భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్‌ఎఫ్‌) నుంచి రూ.3,448 కోట్లు  ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్టు ఒక ప్రచారం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలతో పాటు పర్యటించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ ఈ మేరకు ప్రకటన చేశారన్నది ఆ ప్రచారసారాంశం. అయితే..

ఒకవైపు.. కేంద్రం ఆ సాయాన్ని విడుదల చేసిందంటూ తన ఎక్స్‌ ఖాతాలో ఏకంగా ఓ పోస్ట్‌ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. త్వరగతిన సాయం విడుదల చేసినందుకుగానూ ఏపీ ప్రజల తరఫున నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారామె. 

మరోవైపు.. ఏపీ తెలంగాణకు తక్షణ సహాయం కింద ఎస్డీఆర్ఎఫ్ నుంచి 3,448 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని, ఈ నిధులలో  కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, వరద నష్టం పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని శివరాజ్‌ సింగ్‌ పేరిట ఒక ప్రకటన విడుదలైంది.  అయితే కాసేపటికే అది ఉత్తప్రచారం అని తేలింది.

కేంద్రం ఇంకా సాయం ప్రకటించలేదు. అదంతా రూమర్‌ మాత్రమే. అసలు ఇంకా నష్టంపై నివేదికను కేంద్రానికి పంపనే లేదు. రేపు(శనివారం) ఆ రిపోర్టును పంపుతాం అని స్పష్టత ఇచ్చారు చంద్రబాబు. 

అధికారులపై మళ్లీ చిందులు
వరద బాధితులకు రేషన్‌ పంపిణీ విషయంలో సీఎం చంద్రబాబు.. మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. ‘‘ఎక్కువ వాహనాలు పెట్టారు. మా వాళ్ళు పద్ధతి లేకుండా చేశారు.ప్యాకింగ్ కూడా సక్రమంగా చెయ్యలేదు. ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయాం అని యంత్రాంగంపై ఆక్రోశం ప్రదర్శించారు. ఇవాళ 80 వేలు కుటుంబాలకు ఇవ్వాలి అనుకున్నాం. ఈరోజు కేవలం 15 వేలు కుటుంబాలకే ఇచ్చాం. రేపు మరో 40 వేల కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎల్లుండి నుండి సరుకులను రేషన్ షాపుల్లో మాత్రమే పంపిణీ చేస్తాం అని చంద్రబాబు వెల్లడించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)