Breaking News

కూటమిలో కుమ్ములాట.. తణుకు ప్రచారంలో ఏం జరగనుందో?

Published on Wed, 04/10/2024 - 12:27

సాక్షి, తణుకు: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో సీట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ పలు చోట్ల కూటమి కార్యకర్తల మధ్య పొసగడం లేదు. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు పార్టీ పెద్దల తీరును తప్పుబడుతున్నారు. దీంతో, కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. 

ఇదిలా ఉండగా.. తణుకు కూటమి రాజకీయంలో సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. తణుకులో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో నేడు తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన చీఫ్‌ పవన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో తణుకు రాజకీయం హీటెక్కింది. 

అయితే, కూటమి నేతల ప్రచారం సందర్భంగా తణుకు జనసేన ఇన్‌చార్జ్‌ విడివాడకు ఆహ్వనం అందలేదు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల తీరుపై జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తణుకు టికెట్‌ టీడీపీకి ఇవ్వడాన్ని జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో నేడు వీరి ప్రచారంపై ఉత్కంఠ నెలకొంది. 

అసంతృప్త నేతలతో మాట్లాడి చల్లార్చే ప్రయత్నం
చంద్రబాబు, పవన్‌ ఉమ్మడిగా పర్యటించే తణుకు, అమలాపురంలో టీడీపీ, నిడదవోలు, పి.గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి అభ్యర్థులకు కొందరు సహకరించడంలేదనే ప్రచారం ఉంది. వీరిద్దరి పర్యటనలో అసంతృప్త నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. చంద్రబాబు-పవన్‌ ఉమ్మడి వ్యూహం కూటమిలో అసంతృప్తులను చల్లారుస్తుందా? టికెట్‌ దక్కని నేతలు ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారా? చూడాలి మరి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)