Breaking News

కాంగ్రెస్‌ పాలనలో స్ట్రీట్ లైట్స్ కూడా వెలగడం లేదు: కిషన్‌రెడ్డి

Published on Sun, 01/19/2025 - 14:47

సాక్షి,హైదరాబాద్‌:తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం(జనవరి19) కిషన్‌రెడ్డి సమక్షంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలు చూస్తున్నాం. రెండు పార్టీలు తెలంగాణను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయి. రెండు పార్టీలు బొమ్మ బొరుసులా వ్యవహరిస్తున్నాయి. రెండు పార్టీలు తెలంగాణను దోపిడీ చేస్తున్నాయి. నగరంలో వీధి లైట్లు వెలగలేక వెలవెల పోతున్నాయి. కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది.లిక్కర్ మీద వచ్చే డబ్బులు కూడా  మళ్లించడం ద్వారా లిక్కర్ కంపెనీలు కూడా రాష్ట్రానికి మద్యం ఇచ్చేదిలేదని చెబుతున్నాయి.

బీజేపీపై ప్రజలు నమ్మకం ఉంచారు కాబట్టే ఎనిమిది పార్లమెంట్ స్థానాలను ఇచ్చారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్,కాంగ్రెస్‌లకు లేదు.తెలంగాణ అప్పుల కుప్పగా మారడానికి ఈ రెండు పార్టీలే కారణం.ఒక్క అవినీతి మచ్చ లేకుండా మూడు దఫాలుగా మోదీ దేశాన్ని పరిపాలిస్తున్నారు.తెలంగాణ అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి.డబుల్ ఇంజన్ సర్కారు ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుంది.

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు. రాజ్యాంగం పేరుతో  రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు,విష ప్రచారాలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసింది,అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ.రాజ్యాంగంపై అనేక కుట్రలు చేసి,అంబేద్కర్‌ను ఆనేక రకాలుగా అవహేళన చేసిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ.పంచతీర్థ పేరుతో అంబేద్కర్‌ను సగౌరవంగా గౌరవించిన పార్టీ బీజేపీ.

తెలంగాణలో బీజేపీ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారత రాజ్యాంగ గౌరవ ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నాం. ఇంటింటికి వెళ్తాం. రాజ్యాంగంపై కాంగ్రెస్ చేసిన అవహేళన చరిత్రను ప్రజలకు తెలియజేస్తాం.రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను బయట పెడతాం.సేవ్ తెలంగాణ పేరుతో యువత ముందుకు రావాలి’అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

 

 

 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)