Breaking News

మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్ చెక్ చేసిన సీబీఐ

Published on Tue, 08/30/2022 - 13:40

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేశారు సీబీఐ అధికారులు. లిక్కర్ పాలసీలో అవినీతి కేసు విచారణలో భాగంగా మంగళవారం ఉదయం గాజీయాబాద్‌లోని బ్యాంకులో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో సిసోడియాతో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేయిస్తున్న విచారణలో తనకు క్లీన్‌చిట్ లభించిందని సిసోడియా అన్నారు. సీబీఐ అధికారులకు తన లాకర్‌లో కూడా ఏమీ దొరకలేదని చెప్పుకొచ్చారు. 

సీబీఐ తనిఖీల నేపథ్యంలో సోమవారమే ఈ విషయంపై ట్వీట్ చేశారు సిసోడియా. ఆగస్టు 19న తన ఇంట్లో 14 గంటలు తనిఖీలు నిర్వహించినప్పుడు సీబీఐకి ఎలాంటి అధారాలు లభించలేదని గుర్తు చేశారు. బ్యాంకు లాకర్లో వెతికినా ఏమీ దొరకదని ముందుగానే చెప్పారు. తన కుటుంబసభ్యులమంతా అధికారులకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మంది నిందితుల్లో మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా బ్యాంకు లాకర్‌ను కూడా చెక్ చేసింది.

అవినీతి ఆరోపణలను ఆప్ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. సిసోడియా ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పింది.
చదవండి: మోదీపై కాంగ్రెస్‌ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)