Breaking News

డాక్టర్‌పై దాడి.. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు

Published on Tue, 09/24/2024 - 15:21

సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్‌ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదైంది. నానాజీతో పాటు అనుచరులపై బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు. నానాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంతం నానాజీ పై చిన్న చిన్న సెక్షన్లతో సర్పవరం పోలీసులు  కేసు నమోదు చేశారు.

డా.ఉమామహేశ్వరరావుపై పంతం నానాజీ దౌర్జన్యానికి పాల్పడటంతో రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నరసింహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా పంతం నానాజీని చేర్చగా, కేసు వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.

నానాజీపై చర్యలు తీసుకోవాలని జూనియర్‌ డాక్టర్లు సాయంత్రం ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు డా.ఉమామహేశ్వర రావు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. నిన్న(సోమవారం) ప్రాయశ్చిత దీక్ష అంటూ ఎమ్మెల్యే నానాజీ కొత్త నాటకానికి తెరలేపారు.

ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి

కాగా, రంగరాయ వైద్య కళా­శాల దళిత ప్రొఫెసర్‌పై కాకినాడ రూరల్‌ జన­సేన ఎమ్మెల్యే పంతం నానాజీ దాడికి తెగబడి చంపుతా­నని బెదిరించిన ఘటనపై కేసు నమోదు చేయకుండా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిచింది. రాష్ట్ర­వ్యాప్తంగా వైద్యవర్గాల నుంచి తీవ్ర ఆగ్ర­హాం వ్యక్తమవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. కాకినాడ రంగరాయ వైద్యకళాశాల గ్రౌండ్స్‌­లో వైద్య విద్యార్థులకు కేటాయించిన వాలీ­బాల్‌ కోర్టులో అనుమతి లేకుండా ఎమ్మెల్యే అనుచ­రులు దౌర్జన్యంగా ఆటలాడటంపై అభ్య­ంతరం చెప్పినందుకు ఆర్‌ఎంసీ స్పోర్ట్స్‌ వైస్‌ చైర్మన్, ఫోరె­న్సిక్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ ఉమామహే­శ్వరరా­వును నానాజీ బండ­బూ­తులు తిడు­తూ పిడిగుద్దులు కురిపించిన ఘటన రాష్ట్ర­వ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే.
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)