Breaking News

Byreddy Siddharth Reddy: నారా లోకేష్‌పై బైరెడ్డి సిద్దార్ధ్‌ రెడ్డి ఫైర్‌

Published on Thu, 02/16/2023 - 15:25

సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌బాబుపై ఏపీ శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 2,3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని సంచలన కామెంట్స్‌ చేశారు. అవినీతిపై నారా లోకేష్‌ మాట్లాడటం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, బైరెడ్డి సిద్దార్ధ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఇల్లు కట్టుకుని రాజకీయాలు చేయమని టీడీపీ నేతలే చంద్రబాబుకు చెబుతున్నారు. సీఎం జగన్‌పై లోకేష్‌ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మంగళగిరిలో గెలవలేని వ్యక్తి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాడంటా. లోకేష్‌ ఒక ఫెయిల్యూర్‌ పొలిటీషియన్‌. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి చవిచూస్తుంది. 

ప్రజాన్యాయస్థానంలో గెలిచిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. సీఎం జగన్‌పై కుట్రలు పన్ని కేసులు పెట్టించారు. సీఎం జగన్‌ నిత్యం ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. ఉద్దానం సమస్యను పరిష్కారం చూపింది సీఎం జగన్‌ మాత్రమే. చంద్రబాబులాగా అబద్దపు హామీలు ఇచ్చే అలవాటు మాకు లేదు. ఐదేళ్లలో అన్ని హామీలు నెరవేరుస్తాము. మంత్రి రోజాను మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్‌ కాదంటూ హెచ్చరించారు.

2014-19లో సిమెన్స్‌ కంపెనీని వాడుకుని రూ.250కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా?. రూ. 250 కోట్లు ఏవిధంగా మాయమయ్యయో లోకేష్‌ చెప్పాలి. సిమెన్స్‌ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై లోతుగా విచారణ చేయాలి. టీడీపీ శ్రేణులు వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాను.  అచ్చెన్నాయుడు కుంభకోణంపై విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు అవినీతిపై వేల పుస్తకాలు వేయొచ్చు. 

ఎన్నడూ లేనివిధంగా ఏపీలో స్కూల్స్ అన్ని బాగుపడ్డాయి. ప్రతీ గ్రామానికి వైద్య సేవలు అందుతున్నాయి. విత్తనం నుంచి మద్దతు ధర వరకూ రైతులకు అండగా ఉన్నాము. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్రం వెనుకబడిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడటం టీడీపీకి ఇష్టం లేదు. ఆరోపణలు చేస్తూ ఒక భ్రమలో బతుకుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)