Breaking News

నీ అభివృద్ధి కోసం పార్టీ మారావా...?: కేటీఆర్‌

Published on Sat, 09/13/2025 - 21:15

జోగులాంబ గద్వాల్‌:  తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో కూడా కేసీఆర్‌ అభివృద్ధి చేశారన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. గద్వాలను జిల్లా చేసింది.. మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తమ హయాంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూమ్‌లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రంగుమార్చి  ప్రారంభించిందన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో కూడ గద్వాల ముందుంది. కాంగ్రెస్‌ నాయకులు మాయామాటలు మాట్లాడుతున్నారు. రైలుకింద తలపెట్టిన చనిపోతా కాని కాంగ్రెస్‌లో చేరనన్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎందుకు మారాడు. 

నీ సొంత అభివృద్ధి కోసం పార్టీ మారావా ఎమ్మెల్యే. కాంగ్రెస్‌ హయంలో నియోజకవర్గానికి పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యే ఒక్క రూపాయ తెచ్చాడా?, కాంగ్రెస్‌ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. సిగ్గులేని విధంగా రేవంత్ రెడ్డి సంకలచిక్కి సన్నాయినొక్కులు నొక్కుతున్నాడు స్దానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి. సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది పార్టీ పిరాయింపు చేసిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పదు.

6 నుంచి 9 మాసాల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక రావడం ఖాయం. గద్వాలలో బీఆర్ఎస్ అభ్యర్ది 50 వేల మెజారిటీతో గెలవటం ఖాయం. దొంగలముఠాలో బండ్ల చేరాడు..ఆయన్ను చిత్తుచిత్తుగా ఓడించాలి. స్కూటీలు మరిచి సీఎం లూఠీలు చేస్తున్నారు. స్దానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ అభ్యర్దులను గెలిపించాలి. ఉపఎన్నికల్లో డంకామోగించాలి’ అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)