కాంగ్రెస్‌ సర్కార్‌పై వరుస పోరాటాలు

Published on Wed, 05/14/2025 - 04:07

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అంతమొందించే శక్తి బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను మోసం చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కిందని, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో మంగళవారం రాత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌ సభతో కాంగ్రెస్‌ అంతానికి ఆరంభం షురూ అయిందన్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు బీఆర్‌ఎస్సేనని, సభ తర్వాత ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఓ పాజిటివ్‌ ఎనర్జీ వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం ఈ సభ ద్వారా కలిగిందని కేటీఆర్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత వ్యతి రేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు. 

అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవడం అనే లక్షణాలు పుష్కలంగా ఉన్న రేవంత్‌ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పోయిందన్నారు. ప్రజల్లో ఉన్న కాంగ్రెస్‌ వ్యతిరేకతకు అనుగుణంగా ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవాలని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ విస్తృత పోరాటాలు చేస్తుందన్నారు. 

రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో చూపిస్తున్న నిర్లక్ష్యం, అకాల వర్షాల తో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీ కార్యాచరణ ఉండబోతుందని తెలిపారు. ఇటీవల వెలుగుచూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్‌ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండ గట్టాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగసభ 
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీసభగా ఎల్కతుర్తి రజతో­త్స­వ సభ నిలిచిపోతుందని కేటీఆర్‌ అన్నారు. ఈ విజ­యానికి కారణమైన ప్రతీ కార్యకర్త, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. పకడ్బందీ ప్రణాళిక, క్రమశిక్షణ, ప్రజల్లో బీఆర్‌­ఎస్‌పై ఉన్న అంతులేని అభిమానానికి ఎల్కతుర్తి సభనే నిదర్శనమన్నారు. ఈ బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజ­కీయాల దిశ మారిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

ఈ సంద­ర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు మా­ట్లాడారు. పార్టీ 25 సంవత్సరాల సంబురాన్ని వరంగల్‌ గడ్డపై నిర్వహించే అవకాశం తమకు ఇచ్చినందుకు కేసీఆర్‌­కు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విషయాల్లో తమకు దిశానిర్దేశం చేసిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సభ నిర్వహణలో భాగమైన నేతలతో కలిసి కేటీఆర్‌ భోజనం చేశారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)