Breaking News

ఖమ్మంలో 10కి 10 స్థానాలు గెలుస్తాం: మంత్రి పువ్వాడ అజయ్‌

Published on Mon, 04/17/2023 - 07:36

సాక్షి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అసెంబ్లీ గేటు దాటనివ్వనని ఒకరు ‘మంగమ్మ శపథం’చేస్తున్నారని, అయితే ప్రజలే తమను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్వార్థపూరిత, డబ్బు రాజకీయాలు నడవవని, జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలనూ బీఆర్‌ఎస్‌ గెలుచుకుంటుందని మంత్రి అన్నారు.

ఆదివారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో అనవసరంగా వైరం పెంచుకున్నవారికి శంకరగిరి మాన్యాలే శరణ్యమని ఎద్దేవా చేశారు. పారీ్టకి కార్యకర్తలే బలం, బలగం అని, త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి బీఆర్‌ఎస్‌ సత్తా చాటుతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి అవగాహన, అభివృద్ధి, సంక్షేమంపై విస్తత ప్రచారం కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సాయం త్వరలోనే అందిస్తామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
చదవండి: దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుతున్నారు 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)