Breaking News

బీఆర్‌ఎస్‌ టికెట్ల లొల్లిలో రాసలీలల ట్విస్ట్‌!

Published on Sun, 08/20/2023 - 08:52

సాక్షి, ఖమ్మం: అధికార పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు  టికెట్ల కుంపటి భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌లో టికెట్ల వార్‌ కొనసాగుతుండగా.. వైరాలో అది మరో టర్న్‌ తీసుకుంది. 

వైరా టికెట్‌ తనకే మళ్లీ వస్తుందంటూ ఎమ్మెల్యే రాములు నాయక్‌ ధీమాగా ఉండగా.. తమకే వస్తుందంటూ అనుచరులతో హల్‌ చల్‌ చేయించుకుంటున్నారు మాజీలు మదన్‌లాల్‌, బానోతు చంద్రావతిలు. ఈ క్రమంలో మదన్‌లాల్‌కే టికెట్‌ అనే ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తున్న ఆయన వర్గీయులకు ఊహించని ఝలక్‌ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్  రాసలీలలు  ఫోటోలు తెరపైకి వచ్చి వైరల్ ప్రకంపనలు సృష్టించాయి. 

వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం అక్కడి వాట్సాప్‌ గ్రూపుల్లో, సోషల్‌ మీడియా అకౌంట్‌లలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారా? అంటూ ప్రత్యర్థి గ్రూపులు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.

అయితే.. అవి మార్ఫింగ్‌ ఫొటోలు అని, మదన్‌లాల్‌కే బీఆర్‌ఎస్‌ అధిష్టానం టికెట్‌ ఇవ్వనుందని, అది తట్టుకోలేకే ఎమ్మెల్యే రాములు నాయక్‌ వర్గమే ఈ పని చేయించిందని మదన్‌లాల్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రాములు నాయక్‌ వర్గం మాత్రం ఆ అవసరం తమకు లేదని చెబుతోంది. 

డీజీపీకి ఫిర్యాదు చేస్తా: మదన్‌లాల్‌
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్పింగ్ చేసిన ఫొటోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మరోవైపు ఈ ప్రచారంపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)