Breaking News

కొణతం దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలి: జగదీష్‌ రెడ్డి

Published on Thu, 09/05/2024 - 15:35

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం ఇంఛార్జ్‌ కొణతం దిలీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా దిలీప్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించినట్టు తెలుస్తోంది.

కాగా, కొణతం దిలీప్‌ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే, రాష్ట్రంలో వర్షాల కారణంగా విపత్కర సమయాల్లో వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దిలీప్‌ను అరెస్ట్‌ చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, దిలీప్‌ అరెస్ట్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు స్పందిస్తున్నారు. 

బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌ వద్ద మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నిజాలు చెప్పేవారిని తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుంది.  తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడి, ప్రభుత్వ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా పనిచేసిన కొణతం దిలీప్‌ను అక్రమంగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. దిలీప్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. ఐదు గంటలుగా పీఎస్‌లోనే బంధించారు. దిలీప్‌ మనోవేదనకు గురయ్యారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పమంటే మేము అరెస్ట్ చేయలేదు. విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. తెలుగు స్క్రైబ్‌లో పెట్టిన వార్తపైన విచారణ చేస్తున్నామంటున్నారు.

 శాంతి భద్రతలకు ఎక్కడ భంగం జరిగిందో పోలీసులు చెప్పాలి. పై నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారం పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీనీ అమలు చేయడం లేదు. వరదల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైంది. వరదల్లో ఎక్కడ మంత్రులు కనిపించలేదు. కొందరు సినిమాలు చూసుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో నిజాలు చెప్పేవారిని ప్రభుత్వం వేధిస్తుంది. దిలీప్‌ను వెంటనే రిలీజ్ చేయాలి అని డిమాండ్‌ చేశారు.

బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ..‘ఎలాంటి కారణం లేకుండా దిలీప్‌ను అక్రమంగా నిర్బంధించారు. తెలుగు స్కైబ్‌కు దిలీప్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఏవైనా ఆధారాలుంటే చూపించాలి. మత కలహాలను రెచ్చగొట్టే బీజేపీని ఏమీ అనట్లేదు. బీఆర్‌ఎస్‌ పార్టీకి తెలుగు స్రైబ్‌కి ఎలాంటి సంబంధం లేదు. సీఎం ఆదేశాల మేరకే పోలీసులు దిలీప్‌ను కిడ్నాప్ చేశారు అని కామెంట్స్‌ చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)