Breaking News

‘ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ హస్తం’

Published on Mon, 02/09/2026 - 15:57

మెదక్‌:  సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌  అగ్నిప్రమాదం వెనుక రేవంత్‌ హస్తం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్‌ రావు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన హరీష్‌.. రేవంత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

‘ఓటుకు నోటు కేసులో రేవంత్‌ జైలుకు పోవడం ఖాయం. అందుకే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ను దగ్ధం చేసిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేసిండు. ఆ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్‌ డైరెక్షన్‌లో జరిగిన ప్రమాదం అది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైదరాబాద్‌లో  ఫోరెన్సిక్ ల్యాబ్ ను దగ్దం చేసిండు. పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నిండు. 

హైదరాబాద్‌లో పేదల బతుకులు కూల్చిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేసిండు. రేవంతు డైరెక్షన్ లో పోలీసులు చేసిన దహనకాండ. ఓటుకు నోటు కేసులో రేవంతుకు శిక్ష పడక తప్పడు, జైలుకు పోక తప్పదు. రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పోయిండు ముఖ్యమంత్రి..కానీ మెదక్‌కు వచ్చేందుకు ముఖం లేదు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి ఆయనకు భయం

రుణమాఫీ మాట తప్పి మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. ఎరువుల కరువు తెచ్చిండు రేవంత్‌. రేవంత్‌  బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదు. రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదు. షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదు. తులం బంగారం దిక్కు లేదు. కేసీఆర్ గారు మైనార్టీ గురుకులాలు కట్టారు. షాదీ ఖానా ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని సెక్యూలర్ పార్టీగా నిలబెట్టారు. హిందూ ముస్లింలను అన్నదమ్ములుగా చూసింది బీఆర్‌ఎస్‌. తెల్లారితే మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్‌ను తిడితే, హరీశ్ రావును తిడితే పేదల కడుపు నిండుతుందా?, ఇక్కడి ఎమ్మెల్యే చాలా గొప్పోడు. ఎన్నికల సమయంలో 25 గంటల కరెంటు ఇస్తా అన్నడు. కనీసం 12 గంటలు కూడా రావడం లేదు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు అని గుండు కొట్టిండు. ఉద్యోగస్థులకు డీఏ లేదు, పీఆర్సీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్ బెన్ఫిట్స్ లేవు. అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి’ అని ధ్వజమెత్తారు హరీష్‌రావు.

రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ తెచ్చారు: హరీశ్

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)