Breaking News

తెలంగాణను ఉద్దరించలేనోడు.. ఢిల్లీని ఉద్దరిస్తాడా?: కేటీఆర్‌

Published on Fri, 01/17/2025 - 14:41

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘రేవంత్‌రెడ్డి( Revanth Reddy) ఢిల్లీని ఉద్దరిస్తానంటున్నారు.. తెలంగాణను ఉద్దరించలేనోడు ఢిల్లీని ఉద్దరిస్తాడా?’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో బీఆర్‌ఎస్‌ రైతు దీక్ష(BRS Rythu Diksha)లో ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చామని ఢిల్లీలో సీఎం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

‘‘ప్రతీ ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇవ్వాలి. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదు. రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. రైతులను సీఎం రేవంత్‌ మోసం చేశారు. కొండారెడ్డి పల్లె, కొడంగల్‌లో ఒక్క ఊర్లో  అయినా పూర్తి స్థాయి రైతు రుణమాఫీ  అయితే  రాజకీయ సన్యాసం  తీసుకుంటా’’ అని సవాల్‌ విసిరారు.

‘‘ఒక్క  ఊర్లో అయినా 100 శాతం రుణమాఫీ అయ్యిందని.. రైతులు చెబితే బీఆర్‌ఎస్‌ పార్టీ  ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తా. మళ్ళీ ఓట్లకు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు.. గళ్ళ పట్టుకొని  రైతు రుణమాఫీ, రైతు  భరోసా  డబ్బులు  ఎక్కడని అడగండి’’ అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ రైతు దీక్షలో పాల్గొన్న కేటీఆర్

ఇదీ చదవండి: అఫ్జ‌ల్‌గంజ్‌ టూ ట్యాంక్‌బండ్‌ అలర్ట్‌.. బీదర్‌ ముఠా ఎక్కడ?

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు