Breaking News

‘రేవంత్‌ కక్ష సాధింపు.. తెలంగాణ తేవడమే కేసీఆర్ నేరమా?’

Published on Sat, 01/31/2026 - 13:40

సాక్షి, సిద్దిపేట: రాజకీయ నేతలకు ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి  ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. ఫోన్‌ నెంబర్లు ఇచ్చి ట్యాప్‌ చేయమని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఇలా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు.

సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో రెండేళ్ల నుంచి బీఆర్‌ఎస్‌పై వేధింపులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో సమస్యలను పక్క దారి పట్టించి.. అలీబాబా 40దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. 1875లోనే ట్యాపింగ్‌పై చట్టం వచ్చింది.

ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ కుట్రల నుండి కేసీఆర్ తెలంగాణ తేవడమే నేరమా?. రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సమ్మక్క సారలమ్మ జాతరకి రమ్మని ఎర్రవెల్లికి వెళ్ళి ఆహ్వానిస్తారు. కానీ, పోలీస్ అధికారులు నంది నగర్ ఇంటి వెళ్లి నోటీసులు ఇస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌కి నోటీస్ ఇచ్చారు. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయం అని ఘాటు విమర్శలు చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)