Breaking News

‘గవర్నర్‌ అనుమతి’తో బీఆర్‌ఎస్‌ అలర్ట్‌!

Published on Sun, 12/15/2024 - 03:58

సాక్షి, హైదరాబాద్‌: ‘ఫార్ములా–ఈ’ రేస్‌ వ్యవహా­రంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీ రామారావుపై విచారణకు గవర్నర్‌ అనుమతి ఇచ్చారన్న వార్తల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అప్రమత్తమైంది. ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం కేటీఆర్‌కు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు సన్నద్ధ­మ­వుతున్నట్టు సమాచారం. 

సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఏసీబీ నోటీసులు, విచారణ తంతు జరిగే అవ­కాశం ఉందని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. ఏసీబీ నుంచి నోటీసులు అందే పక్షంలో అ­ను­సరించాల్సిన వ్యూహంపై పార్టీ లీగల్‌ సెల్‌ కస­రత్తు చేస్తున్నట్టు సమాచారం. 

ఫార్ములా–ఈ రేస్‌ అంశంలో తీసుకున్న నిర్ణయాలకు గతంలో మంత్రిగా పూర్తిగా తనదే బాధ్యత అని కేటీఆర్‌ ప్రకటించారు. మరోవైపు లగచర్ల ఘటనకు సంబంధించి రిమాండ్‌ రిపోర్టులో కేటీఆర్‌ పేరు ఉండటంతో ఆయనను అరెస్టు చేయవచ్చని అప్పట్లోనే ఊహాగానాలు వచ్చాయి. 

తనను ఏదో ఒక కేసులో అరెస్టు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నవంబర్‌లో కేటీఆర్‌ ప్రకటించారు కూడా. అందులో భాగంగానే ‘ఫార్ములా–ఈ రేస్‌’ అంశాన్ని తాజాగా తెరమీదకు తెస్తున్నారని పార్టీ నేతల వద్ద కేటీఆర్‌ పేర్కొన్నట్టు తెలిసింది.

అసెంబ్లీని స్తంభింపజేసే యోచన
దర్యాప్తు సంస్థల నుంచి అందే నోటీసులకు సమాధానాలిస్తూ, విచారణలకు హాజరవుతూనే ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేలా ఎలాంటి కార్యాచరణ అనుసరించాలనే కోణంలో పార్టీ నేతలు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నోటీసులిస్తే సభలోనే చర్చకు పట్టుబట్టాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. 

కేటీఆర్‌ అరెస్టు జరిగితే అసెంబ్లీని స్తంభింపజేసేలా పార్టీ కార్యాచరణ ఉంటుందని, అవసరమైతే సమావేశాలను బహిష్కరించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. రేవంత్‌ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేస్‌ను రద్దు చేయడంతో రాష్ట్ర ఖజానాకు రూ.800 కోట్లు నష్టం జరిగిందని బీఆర్‌ఎస్‌ వాదిస్తోంది. మరోవైపు హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి నిధులు చెల్లించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంటోంది.

కక్ష సాధింపు రాజకీయాలను నిలదీద్దాం
రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్‌.. ఈ అంశాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. కేటీఆర్‌ విచారణకు గవర్నర్‌ అనుమతి కోరడం, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసులు పెట్టడం ద్వారా పార్టీ ముఖ్య నేతలను ఆత్మరక్షణలోకి నెట్టాలనే వ్యూహాన్ని రేవంత్‌ ప్రభుత్వం అమలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్‌ లక్ష్యంగా కేసులు, అరెస్టులు జరిగితే క్షేత్రస్థాయిలో ఉద్యమకాలం నాటి తరహా ఆందోళనలు చేపడతామని పేర్కొంటున్నారు.

బీజేపీ సహకరిస్తుందనే విమర్శలతో..
ఫార్ములా–ఈ రేస్‌లో కేటీఆర్‌ విచారణకు గవర్నర్‌ అనుమతివ్వడం వెనుక రాజకీయ కోణం ఉందని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. సీఎం రేవంత్‌ కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నేతలతో అంటకాగుతున్నారని, అందులోభాగంగానే గవర్నర్‌ అనుమతి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. సీఎం రేవంత్‌ ఇటీవలి ఢిల్లీ పర్యటన, వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు వంటివి కూడా బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టడం లక్ష్యంగా సాగినట్టు బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)