Breaking News

కేసులకు బెదిరే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత

Published on Sat, 02/15/2025 - 12:59

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్‌ 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది లేదని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. ప్రజాక్షేతంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదని హితవు పలికారు. అలాగే, పరిపాలన చేయడం చేతగాక బీఆర్‌ఎస్‌ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఈ సందర్బంగా ఖమ్మం జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. అనంతరం, కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ​ప్రశ్నించిన సురేందర్‌ లాంటి వారిని అక్రమ కేసులు పెట్టీ జైలుకు పంపడం సరికాదు. తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వెలగపెట్టింది ఏమీ లేదు. మీ వైఫల్యాలను కచ్చితంగా ఎండగడతాం. ఒక్క సురేందర్‌కే కాదు.. రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడకు అంతా కలిసి వెళ్లి వారికి అండగా ఉంటాం. ప్రజా క్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదు. లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.

కేసీఆర్‌ను  కట్టడి చేయాలని చూస్తున్నారు. పార్టీకి చెందిన వారిని కొందరని అరెస్ట్‌ చేస్తే కేసీఆర్‌ను అడ్డుకున్నట్టా?. రైతుబంధు రాలేదు.. రైతుబీమా రాలేదు, పెన్షన్‌ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్నీ దొంగ మాటలే. 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసిందేమీ లేదు. కాంగ్రెస్‌ పాలనపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కేసులకు భయపడొద్దు, ప్రజా క్షేత్రంలో పోరాడుతూనే ఉందాం’ అని పార్టీ శ్రేణులకు సూచించారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)