దద్దరిల్లిన అసెంబ్లీ: చేతికి సంకెళ్లతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

Published on Tue, 12/17/2024 - 10:24

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్‌ నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.

‘లగచర్ల’ఘటనపై నిన్న (సోమవారం) కూడా శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్‌ఎస్‌ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్‌ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.

మరోవైపు, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్‌ఎస్‌ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్‌ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ‘ఈ కార్‌ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్‌
 


 

 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)