Breaking News

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌తో కేటీఆర్‌ భేటీ

Published on Tue, 07/16/2024 - 13:39

సాక్షి,హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాందీ రాజ్యాంగం పట్టుకొని ఫోజులు కొడుతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో అదే కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పుడుతుందని ధ్వజమెత్తారు.

మంగళవారం(జులై16)పార్టీ మారిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు భేటీ అయ్యారు.  
 
ఫిర్యాదు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.మార్చి 18న దానం నాగేందర్ పై ఫిర్యాదు చేశాం.ఇతర ఎంఎల్ఏల విషయంలో కూడా అనర్హత వేటు వేయాలని కోరాము.పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లో చేరి నాలుగు నెలలు అవుతుంది. వారిపై చర్యలు తీసుకోకపోతే అది స్పీకర్‌ పదవికే అవమానని తెలిపారు.

మూడు నెలల్లో పార్టీ మారిన ఎంఎల్ఏలపై  చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మణిపూర్‌లో పార్టీ మారిన ఎంఎల్ఏపై చర్యలు తీసుకున్నారు.ఇక్కడ కూడా పార్టీ మారిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్లు కేటీఆర్‌ చెప్పారు.  

రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాందీ ఫోజులు
రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాందీ ఫోజులు కొడుతారు కానీ ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఫైరయ్యారు.  హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎంఎల్ఏ పై చర్యలు తీసుకోవాలని అక్కడ కాంగ్రెస్ కోరుతుంది. కర్ణాటక లో 50 కోట్ల చొప్పున కాంగ్రెస్ ఎంఎల్ఏ లను కొన్నారని అక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నారు..పార్టీ మారబోమని గోవా కాంగ్రెస్ నాయకులతో రాహుల్ గాంధీ ప్రమాణం చేయిస్తున్నారు. కానీ తెలంగాణలో ఏదెచ్చగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్‌ వెల్లడించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)