Breaking News

మళ్లీ పోటీ చేయను.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on Thu, 03/14/2024 - 17:15

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికలని తెలిపారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నదంతా అసత్య ప్రచారమని అన్నారు. 

కాగా మల్లారెడ్డి గురువారం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు.  తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారుతున్నారంటూ మళ్లీ పుకార్లు గుప్పుమన్నాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో డీకేను కలిసినట్లు తెలిపారు. తన మిత్రుడుకి సంబంధించిన యూనివర్సిటీ కొనుగోలు కోసం మాట్లాడేందుకు మాత్రమే వెళ్ళానట్లు పేర్కొన్నారు.

ఓ మధ్యవర్తితో డీకేశివకుమార్‌ వద్దకు వెళ్లిన్నట్లు మల్లారెడ్డి చెప్పారు.  రెండు రోజుల కింద కలిశానని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. శివకుమార్‌ తనకుకు మిత్రుడని పేర్కొన్నారు. తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని.. తమ కుటుంబ సభ్యులు వేరే పార్టీల నుంచి పోటీచేయరన్నారు. ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
చదవండి: తెలంగాణలో పొలిటికల్‌ ట్విస్ట్‌.. జితేందర్‌ రెడ్డి ఇంటికి రేవంత్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)