Breaking News

తెలంగాణ ఉద్యమంలోనూ ఇంతటి నిర్బంధాలు లేవు: హరీష్‌రావు

Published on Fri, 09/13/2024 - 15:23

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే చేస్తారు అంటూ రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

కోకాపేటలో హౌస్‌ అరెస్ట్‌లో ఉన్న హరీష్‌ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో లా అండ్‌​ ఆర్ఢర్‌ ఉందా?. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్‌ నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకున్నారా?. దాడికి పాల్పడిన వారిపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే చేస్తారు. గొడవలకు సీఎం, డీజీపీదే బాధ్యత. మమ్మల్ని ఇవాళ హౌస్‌ అరెస్ట్‌ చేయించారు. నిన్న అరికెపూడి గాంధీని ఎందుకు హౌస్‌ అరెస్ట్‌ చేయించలేదు.

నిన్న గాంధీని హౌస్‌ అరెస్ట్‌ చేయిస్తే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగేది కాదు కదా?. ఇది గాంధీ చేసిన దాడి కాదు.. రేవంత్‌ రెడ్డి చేయించిన దాడి. ఇది స్పష్టంగా రేవంత్‌ రెడ్డి అజెండా అని అర్థమవుతోంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. రేవంత్‌వి డైవర్షన్‌ పాలిటిక్స్‌. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఏదో ఒక డ్రామాకు తెరలేపుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి నిర్భందాలు చూడలేదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

ఇది కూడా చదవండి: తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)