రుణమాఫీలో మాది ఆల్‌ టైం రికార్డ్‌

Published on Sat, 07/20/2024 - 05:13

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ తొమ్మిదిన్నరేళ్లలో పాలనలో తెలంగాణలో వ్యవసాయ రంగం స్వర్ణయుగం సాధించడంతోపాటు రుణమాఫీలో రైతులకు రూ.1.20లక్షల కోట్లు లబ్ధి చేకూర్చి దేశంలోనే ఆల్‌ టైం రికార్డు సృష్టించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం హరీశ్‌రావు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’వేదికగా బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు జరిగిన లబ్ధిని వివరించారు.

కేసీఆర్‌ పాలనలో వివిధ పథకాల కింద రైతులకు రూ.1.20 లక్షల కోట్లు నేరుగా సాయం అందించిందన్నారు. రైతుబంధు కింద 69 లక్షల మంది రైతులకు రూ.72,972 కోట్లు, రైతు బీమా కింద 1.11 లక్షల మంది రైతులకు రూ.6,488 కోట్ల తమ ప్రభుత్వ హయాంలో చెల్లించామన్నారు. రైతు రుణమాఫీ కింద రెండు విడతల్లో కలుపుకుని రూ.29,144.61 కోట్లు చెల్లించామన్నారు. ఇతర రైతు సంక్షేమ పథకాల కింద రైతులకు రూ.11,401 కోట్లు సాయం అందించామన్నారు. 

చిరుద్యోగుల వెతలు తీర్చండి 
ప్రభుత్వ ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఏడు నెలలుగా జీతాలు పొందక అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వారికి వేతనాలివ్వాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రతీ నెలా 1న వేతనాలు చెల్లిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్‌ సర్కారుకు చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)