Breaking News

'పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదు.. 9 ఏళ్లుగా ఆత్మాభిమానం ఎటుపోయింది'

Published on Mon, 04/10/2023 - 13:35

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. వీరిద్దరు చాలా కాలంగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భం లేకుండా సందర్భం సృష్టించుకుని ప్రవర్తించారని చెప్పుకొచ్చారు.

'తమను ఏం చేయలేరనుకొని ఇష్టారీతిలో వ్యవహరించారు. వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదు. ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టం. పార్టీ అధినేతనే విమర్శించే స్థాయికి చేరుకోవడం పరాకాష్ట. ఎవరినైనా వదులుకోకుండా ఉండాలనే పార్టీ చూస్తుంది.  కేసీఆర్‌ను తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీలో చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి.

టీఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఓడినా ఓపికతో వేచి చూడాలని పార్టీ చెప్పింది. కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుంటే అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని కాదని రెబల్స్‌ను పోటీలో నిలబెట్టారు. గత తొమ్మిది ఏళ్ళు గా ఆత్మాభిమానం ఎటుపోయింది? ఇన్ని రోజులు ఏం చేశాడు?' అని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
చదవండి: పొంగులేటి, జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన బీఆర్‌ఎస్‌

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు