Breaking News

95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్‌ 16న బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

Published on Mon, 08/21/2023 - 16:49

సాక్షి, హైదరాబాద్‌: అక్టోబరు 16న వరంగల్‌లో సింహగర్జన సభ ఏర్పాటు చేసి.. అదే రోజు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

నేడు శ్రావణ మాసం మంచి ముహూర్తం కావడంతో ఇదే శుభఘడియగా భావించి మధ్యాహ్నం 2.38 గంటలకు తర్వాత అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులూ చేయలేదని తెలిపారు. అయితే మొత్తంగా తొమ్మిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు.  ఇదిలా ఉండగా సీఎం గజ్వేల్‌, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీలోకి దిగనున్నారు. నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని పెండింగ్‌ పెట్టారు.
చదవండి: BRS List: వివాదాలున్నా వాళ్లకే టికెట్లు

బీఆర్ఎస్‌ సముద్రం లాంటింది
అవకాశాలు రాని అభ్యర్థులు హడావిడీ చేసి భవిష్యత్తును పాడుచేసుకోవద్దు అని హితవు పలికారు. పార్టీలోనే ఉండి, అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో తమకు కూడా అవకాశాలు ఉంటాయని చెప్పారు. టికెట్లు రానంత మాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ సముద్రం లాంటిదని, పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికీ అవకాశాలుంటాయని చెప్పారు.

రాజకీయ జీవితమంటే ఎమ్మెల్యేగా పని చేయడమే కాదని, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్.. ఇలా అనేక అవకాశాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. చాలా మంది జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుందని, గతంలో అలా చేశాం కూడా అని చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ అఖండ విజయం సాధించి తెలంగాణను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 
చదవండి: ‘హైదరాబాద్‌లోని మొత్తం 29 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, మజ్లిసే గెలుపు’

ఎన్నికలంటే బీఆర్‌ఎస్‌కు ఓ టాస్క్‌
ఎన్నికలంటే ఇతర పార్టీలకు పొలిటికల్‌ గేమ్‌ అని, బీఆర్‌ఎస్‌కు మాత్రం ఓ టాస్క్‌ అని కేసీఆర్‌ తెలిపారు. ఎన్నికలను ఒక పవిత్రమైన యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామన్నారు. పూర్తి స్థాయిలో చర్చించి, సంపూర్ణ అవగాహనతోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. నర్సాపుర్‌, జనగామ, నాంపల్లి, గోషామహల్ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని, రాబోయే నాలుగు రోజుల్లో కమిటీ మరోసారి భేటీ అయ్యి, ఈ స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడిస్తామన్నారు. సీట్లు ప్రకటించిన అభ్యర్థులు పూర్తిగా ప్రజల్లో ఉన్నందునే గుర్తింపు ఇచ్చి మరోసారి టికెట్లు కేటాయించామన్నారు. టికెట్లు పొందిన వారందరికీ అభినందనలు తెలుపుతూ.. అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)