Breaking News

‘తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వo’: కేసీఆర్‌

Published on Sun, 12/08/2024 - 18:11

సాక్షి,ఎర్రవల్లి:  తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వo అంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, మండలి సమావేశాలు సోమవారం (డిసెంబర్‌ 9) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గజ్వేల్‌ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎల్పీ ఆదివారం సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ పార్టీ నేతలకు కీలక సూచనలు జారీ చేశారు. ‘‘అసెంబ్లీ, మండలి సమావేశాలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి. సమావేశాల్లో అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. నాడు రైతుబంధు తీసుకొచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. 

బీఆర్‌ఎస్‌ ఎల్పీలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఘత్వం. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా?. సమస్యలు, పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ.. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా?’’ అని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాల్లో ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ వివరించాలి.  నాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి చెప్పాలి. 
 
ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను వివరించాలి.  రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. నిర్భంద పాలన గురించి సమావేశాల్లో ప్రస్తావించాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయమై నిలదీయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలి. అసెంబ్లీ సమావేశాల తర్వాత బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం, పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం, కొత్త కమిటీల నియామకం, భారీ బహిరంగ సభ నిర్వహించేలా బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షనేతలతో కేసీఆర్‌ చర్చించారు. 

చదవండి👉 తెలంగాణలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ సేవలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)