Breaking News

‘గులాబీ’ వనంలో మౌనరాగం!.. ఏం జరుగుతోంది?

Published on Fri, 09/08/2023 - 07:06

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించేంతవరకు ఆందోళన, ఉత్కంఠల్లో మునిగిన  గ్రేటర్‌ పరిధిలోని  బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. పేర్లు వెల్లడి కాగానే సంతోష సంబరాల్లో మునిగిన ఎమ్మెల్యే అభ్యర్థులు  అంతలోనే  ఎన్నికల  సమయాన్ని, అయ్యే వ్యయాన్ని తలచుకొని ఖర్చు ఫోబియాతో ఆందోళనకు గురయ్యారు. ఈలోగా జమిలి ఎన్నికలు ప్రచారంలోకి రావడంతో ఖర్చులకు, ప్రచారానికి కాస్త విరామమివ్వవచ్చని ఊపిరి పీల్చుకున్నారు. 

ఖర్చుల సంగతేంటి?
ఒకవేళ జమిలి ఎన్నికలే వచ్చినా.. ఎన్నికలు జరిగేందుకు దాదాపు ఆర్నెళ్ల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అప్పటిదాకా నియోజకవర్గంలో శ్రేణుల్ని కాపాడుకోవడం, ఖర్చులు భరించడం మరింత భారమే అయినప్పటికీ ఇంకా స్పష్టత రానందున విరామం దొరికిందని భావిస్తున్నారు. జమిలి జరిగితే ఆర్నెళ్లు, జరగకపోతే మూణ్నెళ్లు ఖర్చులు భరించాల్సి ఉన్నందున ఏ మేరకు వీలైతే ఆ మేరకు ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఎలాంటి హడావుడి చేయడం లేదు. ఇది పార్టీ శ్రేణులకు నిరాశ కలిగిస్తోంది. ప్రచారమూ, హడావుడి వంటివి లేకపోవడంతో తాము ఖాళీగా ఉండాల్సి వస్తోందని, విందు వినోదాలకు అవకాశం లేకుండా పోయిందని స్తబ్దుగా ఉన్నాయి.  

అదే దారిలో అసమ్మతి నేతలు.. 
టికెట్‌ ఆశించి దక్కనందున అసంతృప్తిలో మునిగి అసమ్మతితో రగిలిపోతున్న నేతలు సైతం తమ కార్యాచరణకు విరామమిచ్చారు. తమ సత్తా చూపుతామని ఆవేశకావేషాలు ప్రదర్శించిన వారు నిశ్శబ్దంలో మునిగారు. ఉప్పల్‌ నుంచి టికెట్‌ దక్కని సిట్టింగ్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, తన కొడుక్కి టికెట్‌ రానందున మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తమ బలం, బలగం చూపాలనుకున్నప్పటికీ ఎన్నికలెప్పుడో తేలిన తర్వాతే కార్యాచరణకు దిగనున్నట్లు తెలుస్తోంది. 

ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై స్పష్టత రానున్నందున ఆ తర్వాతే తాము రంగంలోకి దిగాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరే కాక టిక్కెట్‌ దక్కని అసంతృప్త నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లడమా, మానడమా అనేది నిర్ణయించుకునేందుకు కూడా తగిన సమయం లభించిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,టికెట్‌ దొరకని అసంతృప్తులకూ, ఎన్నికైన వారి ప్రచారానికీ బ్రేకులు పడ్డాయి.   

మహిళా రిజర్వేషన్ల బిల్లు మరోవైపు.. 
ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పలు పార్టీలు పట్టుబడుతున్న నేపథ్యంలో ఒకవేళ బిల్లు ఆమోదం పొంది రిజర్వేషన్లు అమల్లోకి వస్తే మరింత ఆలస్యమే కాక 33 శాతం  నియోజకవర్గాలను వారికి రిజర్వు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పటికే వచి్చనవారి టికెట్లు కట్టవుతాయి. ఆ స్థానాల్లో మహిళా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుండటంతో అభ్యర్థుల  దూకుడు తగ్గింది. దాంతోపాటే కార్యకర్తలు, పార్టీ శ్రేణుల్లో  జోష్‌ కూడా  తగ్గింది.   

ఇది కూడా చదవండి: పొత్తు సరే.. సీట్ల మాటేంటి? 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)