Breaking News

సచివాలయం వద్ద బీఆర్‌ఎస్‌ నేతల మెరుపు ధర్నా.. హరీష్‌ పరుగులు..

Published on Sat, 08/30/2025 - 12:39

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. కేటీఆర్, హరీష్‌ రావు సహా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ ఆరోపిస్తున్నారు. దీంతో, పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు.

 తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలకు దిగారు. అగ్రికల్చర్ కమిషనర్‌కి ఎరువుల సంక్షేమం పైన వినతి పత్రం ఇచ్చిన అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎరువుల కొరత సమస్య పైన సరైన వివరాలు అందించి పరిష్కార మార్గాలు చూపించేదాకా కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ నినాదాలు చేస్తున్నారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలు చేశారు. 

దీంతో, వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి.. అనంత‌రం విడుద‌ల చేశారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నాయ‌కులు తెలంగాణ స‌చివాల‌యాన్ని ముట్ట‌డించారు. స‌చివాల‌యం ప్ర‌ధాన గేటు వ‌ద్ద బైఠాయించారు. యూరియా కొర‌త తీర్చాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో స‌చివాల‌యం వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వ‌జ‌మెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై వారు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సభ్యులు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు. యూరియా సంక్షోభంకు కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)