Breaking News

సీఎం రేవంత్‌ను కలసిన కేకే

Published on Sat, 03/30/2024 - 03:46

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రెటరీ జన రల్, ఎంపీ కె.కేశవరావు శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కేకే చాలాసేపు రేవంత్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహా రాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, కేకే కుమారుడు వెంకట్‌ కూడా ఈ సమయంలో అక్కడే ఉన్నారు. మరోవైపు స్టేషన్‌ఘ న్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు దీపాదాస్‌ మున్షీ, ఇతర నేతలు శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. సీనియర్‌ నేతలు మల్లు రవి, ఎస్‌.సంపత్‌కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనా రాయణ తదితరులు మున్షీ వెంట ఉన్నారు. వారు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యతో భేటీ అయి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.

నేడు చేరికలు!
ఎంపీ కేకే కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు.  కేకే, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఎప్పుడు చేరుతారనేది స్పష్టతలేదు. ఇక నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి కూడా శుక్ర వారం రేవంత్‌ను కలిశారు. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

నిజామాబాద్‌ జిల్లా నేతలు కూడా..
నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి, ఆ జిల్లాకు చెందిన నేతలు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలంతా కలసి క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు రేవంత్‌ పలు సూచనలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) చైర్మన్‌ తూర్పు నిర్మలా జగ్గా రెడ్డి, ఆమె కుమారుడు భరత్‌సాయిరెడ్డి సీఎంను కలిశారు. తనకు కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్‌లో చేరిన చిత్తరంజన్‌ దాస్‌ 
కల్వకుర్తి రూరల్‌: మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, మళ్లీ సొంతగూటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని చిత్తరంజన్‌ దాస్‌ పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)