Breaking News

ఉచిత విద్యుత్‌ వద్దంటే.. ఊరి పొలిమేర దాకా ఉరికించండి

Published on Wed, 07/12/2023 - 00:47

సాక్షి, హైదరాబాద్‌: ఉచిత విద్యుత్‌కు ఉరివేసేందుకు గాంధీభవన్‌ కేంద్రంగా కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రలను రైతులు తిప్పికొట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్‌ వద్దంటున్న వారిని ఊరి పొలిమేర దాకా ఉరికించాలని,  మూడు గంటల కరెంట్‌ చాలంటున్న వారి మాడు పగిలేలా జవాబు చెప్పాలన్నారు. రైతులకు ఊపిరి లాంటి ఉచిత విద్యుత్‌ను నిలిపివేసి అన్నదాతల ఉసురు తీస్తా మని కాంగ్రెస్‌ చెప్పడం ఆ పార్టీ రాక్షస బుద్ధికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.

రైతాంగానికి ఉచిత విద్యుత్‌ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ వద్దంటున్న కాంగ్రెస్‌ పార్టీ  దిష్టిబొమ్మలను దహనం చేయాలన్నారు. రైతులను పొడుచుకు తినేందుకు కాచుకు కూర్చున్న కాంగ్రెస్‌ రాబందుల్ని తరిమికొట్టి రైతు బంధువులకు అండగా నిలవాలని చెప్పారు.

రైతాంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేశాం
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేసి రైతాంగాన్ని రక్షించేందుకు సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని కేటీఆర్‌ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చించి ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయతోపాటు అనేక సాగునీటి పథకాలు చేపట్టిందన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్‌ దుష్ట విధానాలకు పరాకాష్ట అని, ధరణి రద్దు, రైతుబంధు వద్దు అంటూ ఇప్పటికే వరుసగా రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ హయాంలో ఎదురైన కష్టాలను రైతులు మరిచిపోరని, నాసిరకం విద్యుత్‌ సరఫరాతో ట్రాన్ఫ్‌ఫార్మర్లు, మోటార్లు కాలి రైతులు నిద్రలేని రాత్రులు గడిపారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అర్ధరాత్రి కరెంటుతో రైతులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డారని, ఎరువులు, విత్తనాల కొరత, కల్తీ విత్తనాలు, పురుగు మందులు కూడా రైతులను కాటేశాయని చెప్పారు.

ఉచిత విద్యుత్‌ను ఎత్తేసి మోటార్లకు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మెడపై కత్తి పెట్టినా రైతులను కాపాడుకునేందుకు రూ.30 వేల కోట్లు వదులుకున్నామని కేటీఆర్‌ అన్నారు. రైతులు బాగుపడటాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయని, గతంలో మాదిరిగా బ్రోకర్లు, దళారులను తిరిగి తెచ్చేందుకు ధరణి పోర్టల్‌ రద్దు చేస్తామంటూ ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ హయాం నాటి చీకటి యుగాన్ని మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)