Breaking News

రైతులు చావొద్దు.. ప్రభుత్వాలను చావగొట్టాలే

Published on Wed, 11/19/2025 - 06:14

భైంసా టౌన్‌/ఆదిలాబాద్‌ టౌన్‌: రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చావగొట్టా లని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు పిలుపునిచ్చారు. నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుతోపాటు ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డును మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కపాస్‌ కిసాన్‌ యాప్‌తోపాటు సోయా కొనుగోళ్లకు సంబంధించి బయోమెట్రిక్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలతో పత్తి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ. 20 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. రైతులను కలవడానికి వస్తున్నామని తెలిసి ప్రభుత్వం కేంద్రంతో వీడియో కాన్ఫరెన్స్‌ అంటూ నాటకాలు మొదలుపెట్టిందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. 

రైతులతో రాజకీయాలు చేయొద్దు.. 
కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులతో రాజకీయాలు చేయొద్దని... ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌లో సీసీఐ ఫ్యాక్టరీని తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ మండిపడ్డారు. 20 శాతం తేమ ఉన్న పత్తిని సైతం కొనుగోలు చేసే వరకు కొట్లాడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంటే నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే అంశంపై కేబినెట్‌లో చర్చించే వారని.. కానీ సర్కారు ప్రైవేటు వ్యాపారులతో కుమ్మక్కై యాప్‌లను ఏర్పాటు చేసిందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. 

ఇప్పటివరకు లక్ష క్వింటాళ్లు కూడా కొనలేదు.. 
రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని కేటీఆర్‌ చెప్పారు. ఈసారి అధిక వర్షాలకుతోడు చలికాలంలో సహజంగానే పత్తిలో తేమ ఉంటుందని.. కానీ సీసీఐ మాత్రం 8 శాతం తేమ నిబంధన పేరిట ధరలో కోత పెడుతోందని ఆయన విమర్శించారు. రైతులు క్వింటాల్‌కు రూ. 2 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కనీసం లక్ష క్వింటాళ్ల పత్తి కూడా కొనుగోలు చేయలేదన్నారు. 

స్థానిక బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రామారావు పటేల్‌కు రైతులపై ప్రేమ ఉంటే కేంద్రంతో మాట్లాడి తేమ నిబంధన 20 శాతానికి పెంచేలా చూడాలన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎకరాకు 13 క్వింటాళ్ల సోయా కొనుగోలు చేశామని.. ప్రస్తుతం 7 క్వింటాళ్లకే పరిమితం చేశారని విమర్శించారు. తాము ఠంచన్‌గా రైతుబంధు, రుణమాఫీ, యూరియా బస్తాలు అందించామని కేటీఆర్‌ గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలనలో ఏదీ సమయానికి అందక రైతులు ఆగం అవుతున్నారన్నారు.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)